AP News: పొత్తు లెక్కలు.. మూడు స్థానాలను బీజేపీకి త్యాగం చేసిన జనసేన.. టీడీపీ ఎన్ని సీట్లలో పోటీచేయనుందంటే..

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కివచ్చింది. పొత్తులో భాగంగా జనసేన- బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు, 8 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుంది. వీటిలో జనసేన నుంచి 21 అసెంబ్లీ.. రెండు లోక్‌ సభ స్థానాలు కాగా.. బీజేపీ 10 అసెంబ్లీ .. 6 ఎంపీ స్థానాల్లో పోటీచేస్తుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ.. 17 లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

AP News: పొత్తు లెక్కలు.. మూడు స్థానాలను బీజేపీకి త్యాగం చేసిన జనసేన.. టీడీపీ ఎన్ని సీట్లలో పోటీచేయనుందంటే..
AP Politics
Follow us

|

Updated on: Mar 12, 2024 | 1:02 PM

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కివచ్చింది. పొత్తులో భాగంగా జనసేన- బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు, 8 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుంది. వీటిలో జనసేన నుంచి 21 అసెంబ్లీ.. రెండు లోక్‌ సభ స్థానాలు కాగా.. బీజేపీ 10 అసెంబ్లీ .. 6 ఎంపీ స్థానాల్లో పోటీచేస్తుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ.. 17 లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పినప్పటికీ.. వాటిల్లో మూడు స్థానాలను బీజేపీకి త్యాగం చేసింది జనసేన. ఇక ఉండవల్లి చంద్రబాబు నివాసంలో సుమారు 8గంటల పాటు చర్చించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. మూడు పార్టీల ఉమ్మడి ప్రకటనను అటు చంద్రబాబు, ఇటు పవన్‌ కల్యాణ్ విడుదల చేశారు.

ఒకవైపు పొత్తు ఫిక్స్‌.. సీట్ల సర్ధుబాటు కొలిక్కిరావడంతో విజయవాడలో కేంద్ర మంత్రి షెకావత్ తో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి భేటీ అయ్యారు. సీట్లు, అభ్యర్థుల ఎంపికపై గంటన్నర పాటు చర్చించారు. చర్చల సారాంశాన్ని ఢిల్లీ పెద్దలకు కేంద్ర మంత్రి షెకావత్ వివరిస్తారని తెలిపారు పురంధేశ్వరి. రాష్ట్రపార్టీ నివేదికను కూడా ఇప్పటికే అందజేశామన్నారు. సీట్లపై కేంద్ర పెద్దలు ప్రకటన చేస్తారు.. రెండు మూడు రోజుల్లో ఉమ్మడి పార్టీల ప్రకటన ఉంటుందన్నారు పురంధేశ్వరి..

విజయవాడ సీటుపై నోచెప్పిన టీడీపీ

సీట్లతో పాటు పోటీచేసే స్థానాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. విజయవాడ ఎంపీ సీటు బీజేపీ అడగడంతో టీడీపీ నో చెప్పినట్లు తెలుస్తుంది. అరకు, విశాఖ, రాజమండ్రి, నర్సాపురం లేదా ఏలూరు, రాజంపేట, హిందూపురం సీట్లు బీజేపీ అడినట్లు సమాచారం అందుతుంది. బీజేపీ ప్రపోజల్స్ లో ఉన్న విశాఖ లేదా రాజమండ్రిలో ఏదో ఒక్కటి మాత్రమే టీడీపీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక జనసేనకు మాత్రం బాలశౌరికి మచిలీపట్నం, పవన్‌ కోసం కాకినాడ దాదాపు కన్‌ఫాం అయినట్లు తెలుస్తుంది. అరకు నుంచి కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి, నర్సాపురం- రఘురామకృష్ణరాజుతో పాటు నరేంద్రవర్మ పేర్లను పరిశీలిస్తోంది బీజేపీ. అలాగే.. తిరుపతి- రత్నప్రభ లేదా నీహారిక, హిందూపురం- సత్యకుమార్, రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డిని బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. అనకాపల్లి, ఏలూరుపై క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

మొత్తంగా.. పోత్తులు, సీట్లు సర్ధుబాటు కావడంతో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి మూడు పార్టీలు. రెండు మూడు రోజుల్లోనే లిస్ట్‌ ఫైనల్ చేయననున్నాయి పార్టీలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!