Breaking: ఏపీ ప్రభుత్వం అప్పులపై కేంద్రానికి బీజేపీ ఎంపీ ఫిర్యాదు.. జోక్యం కోరుతూ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్ చేస్తోన్న అప్పులపై ఆయన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతరామన్‌ను కలిసి చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యేలా అదనంగా నిధులు కేటాయించాలంటూ ఆర్ధికమంత్రిని జీవిఎల్ కోరారు. ఈ విషయాలను తెలియజేస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల జగన్ సర్కార్‌పై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు మండిపడ్డారు. అప్పుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసిందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అప్పులు చేయడమేంటంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Met Hon’ble Finance Minister Smt. Nirmala Sitharaman in her Parliament office today & discussed about excessive borrowing by @YSRCParty govt in AP in violation of financial norms highlighted in my Press Conf y’day. Also discussed about completion of Polavaram project.@nsitharaman pic.twitter.com/bwSJ4t2V98
— GVL Narasimha Rao (@GVLNRAO) July 26, 2021
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.