AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GVL Narasimha Rao: అందుకే.. వైసీపీ పోవాలి, బీజేపీ రావాలి.. సోము వీర్రాజుపై కేసు అన్యాయం: ఎంపీ జీవీఎల్

సోము వీర్రాజుపై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నానని జీవీఎల్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ కార్యక్రమాలను ప్రభుత్వం ఎలా నిరోధిస్తుందంటూ జీవీఎల్‌ ప్రశ్నించారు.

GVL Narasimha Rao: అందుకే.. వైసీపీ పోవాలి, బీజేపీ రావాలి.. సోము వీర్రాజుపై కేసు అన్యాయం: ఎంపీ జీవీఎల్
Mp Gvl
Shaik Madar Saheb
|

Updated on: Jun 09, 2022 | 9:13 AM

Share

BJP MP GVL Narasimha Rao: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కేసు నమోదు చేయడం అన్యాయమని ఎంపీ జీవీఎల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోనసీమలో కార్యకర్త ఇంటికి సోము వీర్రాజు వెళ్లడమే నేరమా? అంటూ జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. సోమువీర్రాజును అడ్డుకోవడం అప్రజాస్వామికమని.. ఆయనపై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నానని జీవీఎల్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ కార్యక్రమాలను ప్రభుత్వం ఎలా నిరోధిస్తుందంటూ జీవీఎల్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం బీజేపీ కార్యకలాపాలను అనుమతించడం లేదని నడ్డా జీ నిన్న ప్రస్తావించారని జీవీఎల్ పేర్కొ్న్నారు. అందుకే, వైసీపీ పోవాలి, బీజేపీ రావాలి అంటూ పోస్ట్ చేశారు.

ఇదిలాఉంటే.. బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన సోము వీర్రాజును జన్నాడ జంక్షన్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎస్సైపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. ఎవరు చెప్పారు మీకు అంటూ పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ఎస్‌ఐని తోసేశారు. తన కారుకు అడ్డంగా ముందు ఉన్న వ్యాన్‌ డ్రైవర్‌పైనా సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఎస్సై విధులకు ఆటంకం కలిగించారాని, దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదైంది. ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద పోలీసులు FIR నమోదు చేశారు పోలీసులు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..