BJP: 2024లో అధికారమే టార్గెట్‌గా.. ఇవాళ్టి నుంచే ఏపీలో బీజేపీ ప్రజా పోరు యాత్ర.. విశాఖలో తొలి సభ..
BJP Praja Poru Yatra: రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల సభల్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. విశాఖలో ఈ సాయంత్రం తొలి సభ జరగనుండగా.. ఈ పోరుయాత్రకు సంబంధించి బస్సును..
2024లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఏపీలో పావులు కదుపుతోంది భారతీయ జనతా పార్టీ(BJP). ఇవాళ్టి నుంచి ప్రజాపోరు యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల సభల్ని నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. విశాఖలో ఈ సాయంత్రం తొలి సభ జరగనుండగా.. ఈ పోరుయాత్రకు సంబంధించి బస్సును జెండా ఊపి ప్రారంభించారు సోమువీర్రాజు. రాష్ట్రంలో కుటుంబ పార్టీల ఆగడాల్ని ప్రజలకు వివరించేందుకే ఈ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజాసమస్యలపై రాష్ట్రంలోని అధికార పార్టీని నిలదీసేందుకే ప్రజాపోరు యాత్ర చేపట్టామన్నారు ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. ఏపీలో కుటుంబ పార్టీల దోపిడీని ప్రజలకు తెలియజేస్తామన్నారు.
ఏపీలో 15 రోజులపాటూ ప్రజా పోరు యాత్రకు సిద్ధమైంది బీజేపీ. 17వతేది నుంచి అక్టోబర్ 2 వతేది వరకు ప్రజాపోరు యాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఏపీ లో 5 వేల సభలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందులో భాగంగా
సీఎం జగన్ ఇచ్చిన వాగ్దానాలు, నిలబెట్టుకొని హామీలు అన్నిటిని ప్రజల వద్ద ఎత్తిచూపుతామని అన్నారు. అసెంబ్లీలో కూడా ఈరోజు రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఎస్ఐటిని ఏర్పాటు చేశారు..
రిపోర్టు ఏమైంది. ఎస్ఐటి రిపోర్టును బయటపెట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నంలో 30 వేల మంది సామాన్య ప్రజల ప్లాట్లు ,22 a నిబంధన తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ ఆపేశారు,ప్రజల్ని హింసిస్తున్నారు. అమరావతి రైతులకు బీజేపీ పూర్తి మద్దతు తెలిపింది.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం..