ఢిల్లీకి చేరిన గుర్తు గోల.. గ్లాస్ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ, జనసేన కూటమి.. CECకి కంప్లైంట్
గుర్తు గోల ఢిల్లీకి చేరింది. గ్లాస్ ఇష్యూపై CECకి కంప్లైంట్ చేసింది బీజేపీ, జనసేన కూటమి. తమ గుర్తును వేరే వారికి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో నవతరం పార్టీకి గ్లాస్ గుర్తు కేటాయింపు తీవ్ర దుమారమే రేపుతోంది.
BJP-JSP: గుర్తు గోల ఢిల్లీకి చేరింది. గ్లాస్ ఇష్యూపై CECకి కంప్లైంట్ చేసింది బీజేపీ, జనసేన కూటమి. తమ గుర్తును వేరే వారికి ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో నవతరం పార్టీకి గ్లాస్ గుర్తు కేటాయింపు తీవ్ర దుమారమే రేపుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకుంది బీజేపీ. తన మిత్రపక్షం జనసేనతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది.
పార్టీ నేతలు జీవీఎల్, సునీల్ దేవ్‌ధర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ CECని కలిసి ఫిర్యాదు చేశారు. మరో పార్టీకి ఇచ్చిన గ్లాస్ గుర్తును రద్దు చేసి మరోటి ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల్లో గ్లాస్ గుర్తు జనసేనకు ఇచ్చి, తిరుపతి బైపోల్‌లో వేరే పార్టీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్. పరిషత్ ఎన్నికలు, తిరుపతి బైపోల్‌తో జనంలో కన్ఫ్యూజన్ ఉందని, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే పార్లమెంట్ ఉప ఎన్నికలో ఏదైనా సమస్య వస్తే బీజేపీనే అడగాలని జనసేనకు సూచించారు వైసీపీ ఎమ్మెల్సీ
పార్టీల సంగతెలా ఉన్నా… ఇప్పుడు జనం ఓట్లే కీలకం. నవతరం పార్టీకి గ్లాస్ గుర్తయితే వచ్చేసింది. ఎవరైనా BJP-జనసేన మద్దతుదారులు కన్ఫ్యూజ్ అయి గ్లాస్ గుర్తుకి ఓట్లేస్తే కమలానికి షాక్ తప్పదు.