JC Prabhakar Reddy comments: అవును ఆయన స్పెషల్.. అవును ఆయన మాటలు మరీ స్పెషల్.. అడిగి బుక్కైన సిటిజన్
జేసీని ఏదన్నా అడిగేముందు ఎనకాముందు చూస్కోవాల.. ఎవరన్నా ఎదురెళ్లినా.. ఆయనెవరికన్నా ఎదురొచ్చినా రిస్క్ ఆళ్లకే .. ఆయనకు అనుకోకుండా కోపమొస్తే...అరుదుగా చిరాకుపడితే జేసీ బ్రదర్ ఎందుకవుతారు. టెంపర్‌మెంట్ వైఫైలా ఎప్పుడూ ఆయన చుట్టే ఉంటుంది. మొన్నటిదాకా అంటే...
జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఏదన్నా అడిగేముందు ఎనకాముందు చూస్కోవాల.. ఎవరన్నా ఎదురెళ్లినా.. ఆయనెవరికన్నా ఎదురొచ్చినా రిస్క్ ఆళ్లకే .. ఆయనకు అనుకోకుండా కోపమొస్తే…అరుదుగా చిరాకుపడితే జేసీ బ్రదర్ ఎందుకవుతారు. టెంపర్‌మెంట్ వైఫైలా ఎప్పుడూ ఆయన చుట్టే ఉంటుంది. మొన్నటిదాకా అంటే మాజీ ఎమ్మెల్యే. అయ్యో.. ట్రాన్స్‌ఫార్మర్‌లా ఉండే లీడర్ ఫ్యూజ్ కొట్టేసినట్టు అయిపోయినాడే… అంటా అంతా బాధపడ్డారు.
కానీ పడ్డచోటే మళ్లీ లేచారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. వైసీపీ ఊపులోనూ తొడగొట్టి.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఏ లీడరయినా జనంలోకెళ్లాక ఆ పనీ ఈ పనీ.. ఏదో ఒకటి చేయమని.. అడక్కుండా ఉండరు. చూద్దాం చేద్దాం అని లీడర్లు ఓ మాట అడ్డం వేయకుండా ఉండరు. కానీ అలాంటిలాంటి లీడర్ కాదుగా… అక్కడుంది జేసీ. ఇంకేం జెప్పాల. ఆయన నోట్లో నోరుపెడితే ఆ లెక్కే వేరప్పా.
ముచ్చటపడి ఫలానా పని చేసిపెట్టమని అడిగారే అనుకుందాం… ఆయన స్టయిల్‌లో సర్లేరా చూద్దామంటే అయిపోయేది. ఓట్లు అమ్ముకున్నోళ్లకి అడిగే హక్కు యాడుందంటూ..క్లాస్ పీకారు.
ఆ ఫ్లోలోనే నా జన్మహక్కంటూ రెండు మూడు తిట్లొదిలారు. చివరికి వాళ్ల నోళ్లతోనే అవును అని ఒప్పించారు. డబ్బు తీసుకున్నామని ఒప్పించారు. ఖర్మగాలి ఆయన్ని అడిగామే అనుకున్నట్లు చేశారు. చివరి వారు అడిగిన సమస్య గురించి సూటిగా చెప్పారు. అక్కడ ఉన్న సమస్య గురించి కూడా మీడియాకు వివరించారు. సామాన్య ప్రజలను కొందరు పనిగట్టుకుని మోసం చేస్తుంటారని అన్నారు జేసీ.