ఆకివీడు మార్కెట్లో నోరూరిస్తున్న శీతల్ చేపలు.. ఈ ఫిష్‌కు ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటో తెలుసా..?

చేపలను చూసినా..  చేపల కూరకు సంబంధించిన ఫోటోలు చూసినా.. కొంతమందికి నీళ్లూరుతూ ఉంటుంది. నాన్-వెజ్ తినేవాళ్లకు చేపల పులుసు, ప్రై గురించి..

ఆకివీడు మార్కెట్లో నోరూరిస్తున్న శీతల్ చేపలు.. ఈ ఫిష్‌కు ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటో తెలుసా..?
Shetal Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 05, 2021 | 9:32 PM

Sheetal Fish: చేపలను చూసినా..  చేపల కూరకు సంబంధించిన ఫోటోలు చూసినా.. కొంతమందికి నీళ్లూరుతూ ఉంటుంది. నాన్-వెజ్ తినేవాళ్లకు చేపల పులుసు, ప్రై గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుందిలేండి. అయితే ఒక్కో రకం చేప ఒక్కో టేస్ట్ ఉంటుంది. అయితే ప్రస్తుతం సమ్మర్ సీజన్. దీంతో చెరువుల్లో నీళ్లన్ని అడుగంటుతున్నాయి. ఇక చేపలకు బాాగా ఫేమస్ అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం శీతల్ చేపలు అందుబాటులోకి వచ్చాయి. సముద్ర జాతికి చెందినవిగా చెప్పే ఈ చేపల పెంపకం ప్రస్తుతం జిల్లాలో బాగా సాగుతుంది. కాగా అవి ఇప్పుడు అమ్మకానికి వచ్చాయి.

ఈ చేపలను కొనుగోలు చేసేందుకు స్థానికులు కూడా బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కాగా ఈ చేపకు ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం గురించి మీకు చెప్పాలి. ఈ చేప అస్సలు వెజ్ జోలికి వెళ్లదు. ఓన్లీ నాన్-వెజ్ మాత్రమే తింటుంది. చెరువుల్లోని గురకల్ని, ఇతర చిన్న చేపల్ని తింటూ ఇది జీవనం సాగిస్తుంది. అందుకే దీని సైజ్ కూడా భారీగా ఉంటుంది.  ఈ చేప దాదాపు 3 కిలోల నుంచి 8 కిలోల వరకు బరువు వస్తుందని స్థానిక చేపల పెంపకందారులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని స్థానిక మార్కెట్‌లో ఈ చేప కిలో ధర రూ. 350 నుంచి రూ.400 వరకు పలుకుతుంది.

ఈ చేపకు కేరళ, మహారాష్ట్ర, అసోం తదితర రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ అధికంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం ఆకివీడులోని హోల్‌సేల్‌ మార్కెట్‌కు అధిక మొత్తంలో శీతల్‌ చేపలు అమ్మకానికి తీసుకువచ్చారు.

Also Read: ఈము పక్షులు, సైనికుల మధ్య వార్.. ఈ భీకర యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా..?

ఆ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా లిక్కర్.. పూజ అనంతరం ఏం చేస్తారంటే..?