AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..

ఏపీలో కీలక మార్పులు చేపట్టబోతుంది కూటమి సర్కార్. టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వాలని చూస్తుంది. వాట్సప్ ద్వారా పౌర సేవలు అందించాలని ఏర్పాట్లు చేస్తుంది. ఇంతకీ వాట్సప్‌తో ఏమేం సేవలు అందించనున్నారు?. వాట్సప్ గవర్నెన్స్ ఎలా ఉండబోతుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

AP News: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఈజీగా పొందొచ్చు..
Ap Government
Ravi Kiran
|

Updated on: Jan 21, 2025 | 10:24 AM

Share

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వాట్సాప్‌తో జనన, మరణ ధృవీకరణ పత్రాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదట తెనాలిలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి.. పరిశీలించాలని నిర్ణయించింది. ఆ తర్వాత,.. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వెల్లడించారు. అమరావతిలో విజయానంద్ అధ్యక్షతన.. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్‌టైమ్‌లో సమాచారాన్ని సేకరించాలని సీఎం చంద్రబాబు గతంలోనే ఆదేశించారు. సమర్ధవంతమైన పాలన అందించేలా అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి, మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని కూడా బాధ్యతలు ఫిక్స్ చేశారు. మొదట ప్రతిశాఖలో సమాచార సేకరణ జరగాలని, తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని.. అంతిమంగా ‘వాట్సప్ గవర్నెన్స్’ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని సీఎం నిర్దేశించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సరళతరం చేయాలనేది కూటమి ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగా వాట్సప్ గవర్నెన్స్‌ ద్వారా 150 రకాల సేవలు అందించాలనేది టార్గెట్‌గా పెట్టుకుంది. మొదట జనన, మరణ, కుల ధృవీకరణ పత్రాలతో ప్రారంభించి.. తర్వాత ఒక్కోశాఖను ఇందులోకి తీసుకురావాలని సర్కార్ ప్లాన్ చేసింది.

ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో అన్నీ కంప్యూటరైజ్డ్ చేసి పేపర్ లెస్ వర్క్ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం.. ఇక వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు పౌర సేవలు మరింత చేరువ చేయాలని చూస్తుంది. ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమైన ఆధార్ సేవలను ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లాలని చూస్తుంది. ఇందుకు అవసరమైన కిట్ల కొనుగోలు కోసం రూ.20 కోట్లు నిధులను సీఎం చంద్రబాబు మంజూరు చేశారు. మొత్తంగా.. ఏపీ సర్కార్ సరికొత్త టెక్నాలజీతో ప్రజలకు మరిన్ని సేవలు అందించబోతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు