Tiger Fear: తస్మాత్ జాగ్రత్త.. ఆ గ్రామ పరిసరాల్లోనే సంచరిస్తున్న బెంగాల్ టైగర్..

Tiger Fear: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బెంగాల్ టైగర్. కొన్ని నెలలుగా కనిపించీ కనించకుండా దాగుడు మూతలాడుతూ..

Tiger Fear: తస్మాత్ జాగ్రత్త.. ఆ గ్రామ పరిసరాల్లోనే సంచరిస్తున్న బెంగాల్ టైగర్..
Tiger
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 12, 2022 | 11:41 AM

Tiger Fear: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది బెంగాల్ టైగర్. కొన్ని నెలలుగా కనిపించీ కనించకుండా దాగుడు మూతలాడుతూ.. మూగ జీవాలను చంపుకు తింటోంది. ఆ బెంగాల్ టైగర్.. అనకాపల్లి జిల్లాలోని బావులువాడ తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు రెండురోజుల క్రితం అధికారులు ప్రకటించగా.. తాజాగా మరోచోట ప్రత్యక్షమయ్యింది. విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం పెట్రోల్ బంకు ఇసుక ర్యాంపు మధ్య దిబ్బపాలెం వెళుతూ కనినిపించింది. టైగర్ రోడ్డు దాటుతుండగా కొందరు ప్రయాణికులు గమనించారు. వెంటనే విషయాన్ని అటవీశాఖ అధికారులకు, మీడియాకు అందజేశారు. కాగా, పులి సంచారం నేపథ్యంలో అలర్ట్ అయిన అధికారులు.. దుడ్డుపాలెం, దిబ్బపాలెం, నరసాపురం, వెంకన్నపాలెం తదితర గ్రామాల్లో దండోరా వేస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్లవొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పులి జాడను కనిపెట్టేందుకు, దానిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..