AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: వరదలు ముంచుకొస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ముఖ్య సూచనలు జారీ చేసింది. అధిక వర్షాలమూలంగా లోతట్టుప్రాంతాల్లో వరద ముంచుకొచ్చే ప్రమాదం..

Knowledge: వరదలు ముంచుకొస్తే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి
Flood Safety Tips
Srilakshmi C
|

Updated on: Jul 12, 2022 | 10:37 AM

Share

Precautions of Flood: తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ముఖ్య సూచనలు జారీ చేసింది. అధిక వర్షాలమూలంగా లోతట్టుప్రాంతాల్లో వరద ముంచుకొచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. అవగాహన లేమితో అనేక మంది ప్రజలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. వరద సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, ముఖ్యమైన సూచనలు ఇవే..

వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వరదనీటిలోకి ప్రవేశించకూడదు.
  • మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలి.
  • విద్యుద్ఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు, పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి.
  • ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హోల్స్ ను గుర్తించి ఆ ప్రదేశం ఇతరులకు కనిపించే విధంగా చిహ్నాలు, ఎర్ర
  • జెండాలు లేదా బారికేడ్లు ఉండాలి.
  • వరద నీటిలో నడవడం ప్రమాదకరం. వాహనాలను కూడా నడపకూడదు. రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు.
  • తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని మాత్రమే తినాలి. ఆహారాన్నిప్లేట్/కవర్ తో మూసి ఉంచాలి.
  • వేడిచేసిన/క్లోరినేటెడ్ నీరు త్రాగాలి.
  • పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడాలి.

వరదల తరువాత తీసుకోవల్సిన జాగ్రత్తలు

  • పిల్లలు నీటిలోకి గాని, వరద నీటి సమీపంలోకి గాని ఆడటానికి పంపకూడదు.
  • దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించకూడదు.
  • అధికారులు సూచించిన వెంటనే కరెంట్‌కు సంబందించిన స్విచ్లులను, ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయాలి.
  • తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకకూడదు.
  • విరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, పదునైన వస్తువులు, శిధిలాలను నిశితంగా పరిశీలించాలి.
  • వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినకూడదు.
  • మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడాలి.
  • వరద సమయంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • పాముకాటుకు ప్రధమ చికిత్స ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలి.
  • నీటి మార్గాలు/మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకూడదు.
  • నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగకూడదు.

వరద మూలంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవల్సి వస్తే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

  • మంచం, టేబుళ్లపై ఫర్నిచర్, ఇతర ఉపకరణాలు పెట్టకూడదు.
  • కరెంట్, గ్యాస్ కనెక్షన్లను ఆపివేయాలి.
  • ఎత్తైన భూ ప్రదేశం/సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి.
  • మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలను తీసుకొని వెళ్లాలి.
  • లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించకూడదు. నీటి లోతును తెలుసుకోవడానికి కర్రను ఉపయోగించాలి.
  • అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్లాలి.
  • తడిసిన ప్రతి వస్తువును క్రిమిసంహారకంతో శుభ్రపరచుకోవాలి.