AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penuganchiprolu: మటన్ పెట్టలేదని.. తిరుపతమ్మ ఆలయం వద్ద భక్తులపై యాచకుల దాడి

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై యాచకులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. తమకు మాంసాహార భోజనం పెట్టలేదన్న కోపంతో యాచకులు భక్తులపై దాడికి తెగబడినట్లు సమాచారం. ఈ దాడిలో నలుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Penuganchiprolu: మటన్ పెట్టలేదని.. తిరుపతమ్మ ఆలయం వద్ద భక్తులపై యాచకుల దాడి
Beggars Attack Devotees
Vasanth Kollimarla
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 28, 2025 | 3:58 PM

Share

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో గల తిరుపతమ్మ తల్లిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ఆమెకు ప్రత్యేక పేరు ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి నిత్యం వేలాదిమంది తరలివస్తుంటారు. తాజాగా అక్కడికి వచ్చిన భక్తులపై యాచకులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. తమకు మాంసాహార భోజనం పెట్టలేదన్న కోపంతో యాచకులు భక్తులపై దాడికి తెగబడినట్లు సమాచారం. ఈ దాడిలో నలుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నుంచి తిరుపతమ్మ దర్శనానికి 70 మంది భక్తులు వచ్చారు. వారు మొక్కుబడులు చెల్లించి.. సత్రంలో సాయంత్రం భోజనం చేస్తుండగా, స్థానికంగా ఉండే కొంతమంది యాచకులు భోజనం పెట్టాలని వారి వద్దకు వెళ్లారు. భక్తులు మొదట ఇద్దరికి నాన్ వెజ్ భోజనం పెట్టారు. కొద్దిసేపటికి మరికొందరు గిన్నెలు తీసుకుని వచ్చి నాన్ వెజ్ భోజనం పెట్టాలని కోరారు. తాము అందరం ఇంకా అన్నం తినలేదని చెప్పి.. వారు తమ వద్ద ఉన్న అమ్మవారి ప్రసాదం పులగం పెట్టారు. దీంతో ముందు వచ్చిన వారికి మాంసాహారం పెట్టి, మాకు పులగం పెడతారా? అంటూ యాచకులు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో స్థానికంగా ఉండే సుమారు 20 మంది యాచకులు ఏకమై భక్తులపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీనిపై ఫిర్యాదు చేస్తే అటు అధికారులు, ఇటు పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదని భక్తులు చెబుతున్నారు. ఎక్కడ నుంచో అమ్మవారి దర్శనానికి వచ్చినవారికి ఇలా జరగడం నిజంగా దారుణం. గుడి వద్ద పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతుంది. ఇదే కొనసాగితే భక్తులు భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.