AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be Alert: బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా? రూ.652 కోట్ల లూటీ

Be Alert: సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం, ఫిర్యాదులపై వెంటనే స్పందించడం, డబ్బుల ట్రాకింగ్‌ను వేగవంతం చేయడం కీలకమని అధికారులు చెబుతున్నారు. ఒక్క నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్..

Be Alert: బీ అలెర్ట్.. ఏపీలో సైబర్ క్రైమ్ బాధితులు ఎంతమందో తెలుసా? రూ.652 కోట్ల లూటీ
Ap Cybercrime
Eswar Chennupalli
| Edited By: |

Updated on: May 13, 2026 | 8:30 PM

Share

Be Alert: రాష్ట్రంలో సైబర్ నేరాలు నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయి. ఫోన్ కాల్, మెసేజ్, లింక్.. రూపంలో వచ్చినా ఒక్క క్లిక్‌తోనే ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటివరకు అక్షరాలా 9 లక్షల మంది సైబర్, ఆర్థిక మోసాలకు బలైపోయారు. రోజురోజుకు పద్ధతులు మారుస్తున్న మోసగాళ్ల వల్ల సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపారులు వరకు అందరూ ప్రమాదంలో పడుతున్నారు.

652 కోట్ల లూటీ

ఏపీ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. సైబర్, ఆర్థిక నేరాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఇప్పటివరకు 9.29 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బాధితులు మొత్తం రూ.652 కోట్ల వరకు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. బ్యాంకులతో సమన్వయం చేసి సీఐడీ సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటివరకు సుమారు రూ.116 కోట్లను రికవరీ చేయగలిగింది. పెట్టుబడి మోసాలు ప్రస్తుతం పెద్ద ఎత్తున పెరిగిన ఆర్థిక నేరంగా మారినట్టు అధికారులు చెబుతున్నారు. పిషింగ్, విషింగ్, క్రెడిట్-డెబిట్ కార్డు మోసాలు, ఆన్‌లైన్ లోన్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి.

ఇది కూడా చదవండి: Amul Milk: సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న అమూల్ పాల ధరలు.. రేపటి నుంచే అమలు!

ఇవి కూడా చదవండి

సీఎం రివ్యూ

ఈ పరిస్థితుల నేపథ్యంలో సచివాలయంలో సైబర్, ఆర్థిక నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తక్షణ స్పందన వ్యవస్థను బలోపేతం చేయడం, గోల్డెన్ అవర్‌లో చర్యలు వేగంగా తీసుకోవడం, ఇతరుల బ్యాంక్ ఖాతాలను మోసాలకు వినియోగించకుండా కట్టడి చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. బ్యాంకర్లతో సమన్వయం పెంచి మోసాలను ముందే అడ్డుకునే విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

డీజీపీ ప్రెజెంటేషన్

రాష్ట్ర స్థాయిలో సీఐడీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ పని చేస్తోందని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో సైబర్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఏపీ ఫోరెన్సిక్స్ సలహాదారు కెపీసీ గాంధీ, ఐటీ శాఖ అధికారులు, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అవగాహనే కీలకం

సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం, ఫిర్యాదులపై వెంటనే స్పందించడం, డబ్బుల ట్రాకింగ్‌ను వేగవంతం చేయడం కీలకమని అధికారులు చెబుతున్నారు. ఒక్క నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో బుకింగ్‌కు ముందే ఈ యాప్‌ చెప్పేస్తుంది..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us