AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో బుకింగ్‌కు ముందే ఈ యాప్‌ చెప్పేస్తుంది..!

Indian Railways: రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల 'RailConnect', 'UTS' వంటి పాత యాప్‌ల స్థానంలో RailOne అనే సూపర్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో ఉన్న ప్రధాన ఫీచర్ ఏంటంటే.. మీరు వెయిటింగ్ లిస్ట్ ఉన్న టికెట్ బుక్..

Indian Railways: రైలు టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో బుకింగ్‌కు ముందే ఈ యాప్‌ చెప్పేస్తుంది..!
Train Ticket Booking
Subhash Goud
|

Updated on: May 13, 2026 | 7:48 PM

Share

Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. గతంలో రైలు టికెట్ బుక్ చేసుకున్నాక అది కన్ఫర్మ్ అవుతుందో లేదో అని టెన్షన్ పడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రైల్వే శాఖ ప్రవేశపెట్టిన RailOne మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోకముందే అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!

AI సాంకేతికతతో ఖచ్చితమైన అంచనా

రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ‘RailConnect’, ‘UTS’ వంటి పాత యాప్‌ల స్థానంలో RailOne అనే సూపర్ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లో ఉన్న ప్రధాన ఫీచర్ ఏంటంటే.. మీరు వెయిటింగ్ లిస్ట్ ఉన్న టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విశ్లేషించి చెబుతుంది.

ఇవి కూడా చదవండి

గతంలో ఈ అంచనా ఖచ్చితత్వం 53 శాతంగా ఉండగా, ఇప్పుడు దాన్ని 94 శాతానికి పెంచారు. దీనివల్ల ప్రయాణికులు అనవసరంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకుని ఇబ్బంది పడకుండా, ప్రత్యామ్నాయ రైళ్లను చూసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Vande Bharat: రూ.750 టికెట్‌ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే

RailOne యాప్‌లో లభించే ఇతర సేవలు:

కేవలం టికెట్ కన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా, ఈ సూపర్ యాప్ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనేక సేవలను అందిస్తోంది.

  • రిజర్వ్‌డ్, అన్-రిజర్వ్‌డ్ టికెట్లు: జనరల్ టికెట్లు, రిజర్వేషన్ టికెట్లు ఒకే యాప్ నుండి బుక్ చేసుకోవచ్చు.
  • ప్లాట్‌ఫారమ్ టికెట్లు: స్టేషన్‌కు వెళ్లకముందే మొబైల్‌లోనే ప్లాట్‌ఫారమ్ టికెట్ పొందవచ్చు.
  • లైవ్ ట్రైన్ స్టేటస్: రైలు ఎక్కడుంది? ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
  • ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్: ప్రయాణ సమయంలో నేరుగా మీ సీటు వద్దకే భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు.
  • సింగిల్ సైన్-ఆన్ (SSO): ప్రతి సేవకు వేర్వేరు లాగిన్ అవసరం లేకుండా ఒకే ఖాతాతో అన్ని సేవలను పొందవచ్చు.
  • రైల్వే శాఖ ఆగస్టు 2026 నాటికి తన పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను పూర్తిగా ఆధునీకరించి, ఈ కొత్త హై-స్పీడ్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత బలోపేతం చేయనుంది.
Railone

Railone

ఇది కూడా చదవండి: Amul Milk: సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న అమూల్ పాల ధరలు.. రేపటి నుంచే అమలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us