Banking Working Hours : బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యగమనిక : కరోనా వైరస్ నేపథ్యంలో పనివేళలు తగ్గింపు
Banking Working Hours : కోవిడ్ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తున్న నేపధ్యంలో బ్యాంకు పనివేళల సమయం కుదించబడుతోంది.
Banking staff for reduced working hours : కోవిడ్ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తున్న నేపధ్యంలో బ్యాంకు పనివేళల సమయం కుదించబడుతోంది. రేపటి నుండి మే 15 వ తారీకు వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్నీ బ్యాంకులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. SLBC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ K బ్రహ్మానందరెడ్డి ఈ మేరకు వెల్లడించారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రోజులో పని గంటలు, వారంలో పనిదినాలు తగ్గించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలల వరకు భౌతిక బ్యాంకింగ్‌ను పరిమితం చేయాలని, ఐదు రోజుల పని వారాన్ని అమల్లోకి తీసుకురావాలని ఫోరం డిమాండ్ చేస్తోంది. ఇంటి నుండి పని చేయడం, కనీస సిబ్బందితో బ్యాంకింగ్ వ్యవహారాలు రాబోయే నాలుగైదు నెలల్లో నిర్వహించాలని ఫోరం కోరుతోంది. అంతేకాదు, అన్ని బ్యాంక్ శాఖలను తెరవకుండా ఉండటం ద్వారా కస్టమర్లు, ఉద్యోగులు మహమ్మారికి గురి కాకుండా హబ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ ప్రవేశపెట్టాలని ఫోరం సూచిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Jobs : యువతలో నైపుణ్యాలు పెంచే దిశగా ఏపీ సర్కారు కీలక అడుగు.. ఐ.టీ దిగ్గజ సంస్థ ‘మైక్రోసాఫ్ట్’తో ఒప్పందం