AP: ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు! తాళిని వాళ్ల ముఖంపై విసిరి.. మహిళ ఏం చేసిందంటే..?
కర్నూలు జిల్లాలో బజాజ్ ఫైనాన్స్ సంస్థ వేధింపుల కారణంగా ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కరోనా సమయంలో తీసుకున్న రుణానికి వాయిదాలు చెల్లించలేకపోవడంతో ఇంటికి తాళం వేశారు. అప్పు చెల్లించినా నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వక, అదనపు పెనాల్టీలు విధించడంతో ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.

ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల ఆగడాలు రోజురోజుకు హద్దుమీరుతున్నాయి. ఈ వేధింపుల కారణంగా ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోగా.. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బజాజ్ ఫైనస్ కంపెనీలో ఓ వివహిత ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. కరోనా సమయంలో తన ఇంటిని తాకట్టు పెట్టి వెంకటలక్ష్మి అనే వివహిత 19 లక్షలు అప్పు తీసుకోని వాయిదాల పద్దతిలో కొన్ని నెలలు సక్రమంగా కడుతుండగా, కొన్ని నెలల క్రితం కొన్ని ఇబ్బందులతో నెల వాయిదాలు కట్టకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఇంటికి తాళం వేశారు. దీంతో కొన్ని నెలలు సమయం తీసుకొని కొంత డబ్బులు బ్యాంకు కు జామచేస్తే, ఇంటికి వేసిన తాళం తమ చేతికి ఇచ్చారన్నారు.
అయితే తిరిగి కొంత డబ్బు కట్టాల్సి ఉంటే, అవి కూడా మొత్తం కట్టినా చివరికి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా మళ్లీ పెనాల్టీ లు ఏడు లక్షల రూపాయలు కట్టాలని చెప్పడంతో, మహిళా, భర్త ఇద్దరు కలిసి బ్యాంకు దగ్గరకు చేరుకొని బ్యాంకు సిబ్బందితో వాగ్వదానికి దిగి ఆమె మెడలో ఉన్న మంగళ సూత్రం బ్యాంకు సిబ్బంది ముఖంపై విసిరి కొట్టి, అక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే పక్కన ఉన్న వారు ఆమె చేతిలో ఉన్న పురుగుమందు డబ్బు తీసుకోవడంతో అంత పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేయగా బ్యాంకు సిబ్బంది మహిళకు నో డ్యూ సర్టిఫికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.