Badvel By Election: బద్వేలు నియోజకవర్గంలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. బరిలో నిలిచిన అభ్యర్థులు 15మంది

బద్వేలు ఉప ఎన్నిక బరిలో నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు.

Badvel By Election: బద్వేలు నియోజకవర్గంలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. బరిలో నిలిచిన అభ్యర్థులు 15మంది
Badvel By Election
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 13, 2021 | 4:58 PM

Badvel By Election: బద్వేలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. బద్వేలు ఉప ఎన్నిక బరిలో నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లను బుధవారం ఉపసంహరించుకున్నారు. పలువురు అభ్యర్థుల నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం పోటీలో 15 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య మాత్రమే పోటీ నెలకొంది.

ఈ రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి నామినేషన్ గడువు వరకూ 27 మంది నామినేషన్ వేశారు. నామినేషన్ల పరిశీలనలో 9 మంది అభ్యర్తుల నామినేషన్లకు గానూ సరియైన పత్రాలు లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యారు. చివరగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 15 మంది అభ్యర్థులు బద్వేల్‌ ఉపఎన్నిక పోటీలో నిలిచారు.

Read Also…  Huzurabad By Election: హుజూరాబాద్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం.. బరిలో నిలిచేది వీరే..!