AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తిరుపతిలో ఒకే కుటుంబంపై కత్తులతో దాడి.. వృద్ధురాలు మృతి, బాలిక సీరియస్..!

తిరుపతి రాయల్ నగర్ లో దారుణం జరిగింది. ఇంటిలో చొరబడ్డ అగంతకుడు 67 ఏళ్ల జయలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమె మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలికపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Andhra Pradesh: తిరుపతిలో ఒకే కుటుంబంపై కత్తులతో దాడి.. వృద్ధురాలు మృతి, బాలిక సీరియస్..!
Tirupati Crime
Raju M P R
| Edited By: Balaraju Goud|

Updated on: Jul 19, 2024 | 12:45 PM

Share

తిరుపతి రాయల్ నగర్ లో దారుణం జరిగింది. ఇంటిలో చొరబడ్డ అగంతకుడు 67 ఏళ్ల జయలక్ష్మి అనే వృద్ధురాలిని హత్య చేశాడు. ఆమె మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలికపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ముఖానికి మాస్క్ వేసుకుని ఇంటిలోకి చొరబడిన దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆగంతకుడు ఎందుకు ఈ దారుణానికి ఒడి గట్టాడన్న దానిపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. తిరుపతి రాయల్ నగర్ లో సంచలనంగా మారిన ఈ ఘటనపై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు దారుణంపై ఆరా తీశారు.

తిరుపతి రాయల్ నగర్‌లోని తిలక్ రోడ్డులోని బసవయ్య అండ్ కో యజమాని శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడ్డాడు అగంతకుడు. శ్రీనివాసరావు తల్లి జయలక్ష్మి, ఆయన భార్య సురక్ష, ఇద్దరు కూతుళ్లు ప్రేరణ, నియాతిలపై కత్తితో దాడికి పాల్పడినట్లు గుర్తించారు. వృద్ధురాలు జయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా మనవరాలు 14 ఏళ్ల మైనర్ బాలిక గొంతుపై కత్తితో దాడి జరిగినట్లు గుర్తించారు. దాడి చేసి పారిపోతున్న అగంతకుడు అదే సమయంలో బయటకు వెళ్లి ఇంటి తిరిగి వచ్చిన శ్రీనివాసరావు భార్య సురక్ష, పెద్ద కూతురు ప్రేరణ పై కూడా దాడికి పాల్పడ్డాడు. మెట్లు ఎక్కుతూ ఎదురు వచ్చిన ఇద్దరిపైనా కత్తి దాడికి ప్రయత్నం చేశాడు.

అయితే ఈ దారుణానికి పాల్పడ్డ అగంతకుడు పక్కింటి యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ పుట్టేజి ఆధారంగా దాడికి పాల్పడిన యువకుడిని గుర్తించారు. ఈ మేరకు గాలింపు కొనసాగుతోంది. ఇక రాయల్ నగర్ లో జరిగిన ఘటన బాధాకరమన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు నిందితుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఘటనను చూస్తే తెలుస్తోందన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి ఘటనలు తిరుపతిలో పునరావృతం కాకుండా చూడాలన్నారు.

మరోవైపు రాయల్ నగర్ లో మర్డర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ మర్డర్ కు సంబంధించి కొన్ని క్లూస్ దొరికాయన్నారు. సిసి కెమెరాలో నిందితుడు ఆచూకీ లభించిందన్నారు. ముందుగా అనుకున్నట్లు, నగలు దోచుకోవడానికి దాడి జరగలేదని త్వరలో కేసు మిస్టరీ చేధిస్తామాన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…