ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

ఆర్టీసీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. సుమారు 5 వేల మంది పొరుగు సేవల సిబ్బందికి...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..
Follow us

|

Updated on: Dec 17, 2020 | 3:15 PM

RTC Outsourcing Employees: ఆర్టీసీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. సుమారు 5 వేల మంది పొరుగు సేవల సిబ్బందికి జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులను జారీ చేయనున్నట్లు ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఈ ఫ్రీ పాస్‌లు 25 కిలోమీటర్ల లోపు ప్రయాణానికి వర్తించనుండగా.. వీటి ద్వారా ఉద్యోగి ఇంటి నుంచి కార్యాలయం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చునని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపో మేనేజర్లు, యూనిట్ ఆఫీసర్ల ద్వారా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పాసులు జారీ చేస్తామని ఎండీ కృష్ణబాబు తెలిపారు. ఈ పాసులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు బస్సుల్లో చెల్లుతాయన్నారు. సిబ్బందికి ఆర్ధిక వెసులుబాటు కల్పించడం, మానవతా దృక్పధంతో ఈ బస్సు పాసులు ఇస్తున్నామని ఎండీ కృష్ణబాబు తెలిపారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దని ఆయన సిబ్బందికి సూచించారు.

Also Read:

బిగ్ బాస్ 4 ఓటింగ్: అగ్రస్థానంలో అరియానా.. రెండో స్థానంలో అభిజిత్..!

పోలీసులను ఆశ్రయించిన మోనాల్ గజ్జర్.. అభిజిత్ ఫ్యాన్స్‌పై ఫిర్యాదు..

”మాయా స్తంభం పోయే.. రాక్షసుడి స్టాట్యూలు వచ్చే”.. వైరల్ ఫోటోలు..

ఏడుకొండలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమా..?