AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janaranabheri : జనభేరి సభలో అమరావతి అమరవీరులకు జోహర్లు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రక్షణకై రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభ ప్రారంభమైంది.

Janaranabheri : జనభేరి సభలో అమరావతి అమరవీరులకు జోహర్లు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 17, 2020 | 3:24 PM

Share

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రక్షణకై రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయపూడి వేదికైంది.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. అధికారంలోకి వచ్చిన 18నెలల్లో ఏం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి ఉద్యమం జరగుతోందని చెప్పారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభమై నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా రాయపూడిలో నిర్వహించిన ‘అమరావతి జనభేరి’ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా దూయబట్టారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా? అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Dec 2020 03:19 PM (IST)

    చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి ఉద్యమం..

    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. అధికారంలోకి వచ్చిన 18నెలల్లో ఏం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి ఉద్యమం జరగుతోందని చెప్పారు.

  • 17 Dec 2020 03:13 PM (IST)

    కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారు..-చంద్రబాబు

    ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెబుతున్న వాళ్లు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని విమర్శించారు. రాయపూడిలో జరిగిన జనభేరి సభలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు చంద్రబాబు.

  • 17 Dec 2020 03:08 PM (IST)

    మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా..?-చంద్రబాబు

    ఒక్క అవకాశం అంటూ ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ మోసగిస్తున్నారు అని చంద్రబాు మండిపడ్డారు. మూడు రాజధానుల అంశంపై రెఫరెండానికి సిద్ధమా.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెఫరెండానికి సిద్ధమా అని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.

  • 17 Dec 2020 03:00 PM (IST)

    ‘జనరణభేరి’ సభకు భారీగా తరలివచ్చిన రైతులు, మహిళలు

    ‘జనరణభేరి’ సభకు భారీగా రాజధాని గ్రామాల రైతులు, మహిళలు, నేతలు హాజరయ్యారు. ఆకుపచ్చ కండువా, ఆకుపచ్చ వస్త్రాలు ధరించి రైతులు, మహిళలు సభకు విచ్చేశారు.

  • 17 Dec 2020 02:58 PM (IST)

    ‘జనరణభేరి’లో తొలత అమరావతి అమర వీరులకు చంద్రబాబు నివాళి

    ముందుగా అమరావతి అమర వీరులకు రైతులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమరావతి వీరులకు నివాళిగా రెండు నిముషాల పాటు రాజధాని రైతులు మౌనం పాటించారు.

  • 17 Dec 2020 02:57 PM (IST)

    Janaranabheri : జనభేరి సభలో అమరావతి అమరవీరులకు జోహర్లు అర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు

    నవ్యాంధ్ర రాజధాని అమరావతి రక్షణకై రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాయపూడి వేదికైంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ సభ మధ్యాహ్నం 2 వరకు జరగనుంది.

Published On - Dec 17,2020 3:19 PM