APPSC Group 4 Results: ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ 2023 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో మొత్తం 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ పోస్టులకు ఈ పరీక్ష..

APPSC Group 4 Results: ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ 2023 ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి
APPSC Group 4 Results
Follow us
Srilakshmi C

|

Updated on: May 12, 2023 | 7:47 PM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 4న రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో మొత్తం 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల జాబితాను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచింది.

కాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-4 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,11,341 మంది హాజరుకాగా.. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించారు. మెయిన్స్‌లో అర్హత సాధించినవారిని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. ఇందుకు సంబంధించి నియామకాల తదుపరి ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.