AP Cabinet Meeting: 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సీఎం జగన్ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం..
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో, అధికారులతో చర్చిస్తున్నారు.

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే వారం నుంచి జరగబోతున్న వేళ ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేబినెట్ కీలక అంశాలపై చర్చిస్తోంది. సభలో పెట్టాల్సిన బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మొత్తం 56 అంశాల అజెండాతో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం ఉదయం మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో, అధికారులతో చర్చిస్తున్నారు. 15 వ తేదీ నుంచి ఐదురోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు జగనన్న చేయూత నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు పలు పోస్టుల భర్తీకి కూడా నిర్ణయం తీసుకుంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం గ్రేటర్ విశాఖ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇచ్చిన ప్రొబేషన్ డిక్లరేషన్‌కు, ఒక్కో సచివాలయానికి 20 లక్షల మంజూరుకు ఆమోదం ముద్ర వేయబోతోంది. దివ్యాంగులకు ఉద్యోగ నియమాకాలు, ప్రమోషన్లలో నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించబోతోంది. చింతూరు కేంద్రం కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయబోతోంది.
ఇంకా.. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. కడప జిల్లా కొప్పర్తిలో 386.23 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కాసిస్ ఇ – మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌కు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో 1900 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్న లైఫిజ్ ఫార్మాకు మంత్రి మండలి పచ్చ జెండా ఓకే చెప్పనుంది. మెటలార్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, తయారీ పరిశ్రమతో పాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఇండోసోల్ సోలార్ సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.




మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..