Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Somu Veerraju: తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేశారు.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

పవిత్రమైన తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.

Somu Veerraju: తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేశారు.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
Somu Veerraju
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 07, 2022 | 10:54 AM

Somu Veerraju comments: భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్ధనలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ టైమ్ అభివృద్ధి జరగాలని తాను తిరుపతి వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు చెప్పారు. అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్.. అభివృద్దికి అనువైన రాష్ట్రమంటూ సోము తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రం సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడ్డారు. కాగా, సోము వీర్రాజు వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. ఆయన ఎవర్ని టార్గెట్ చేస్తూ అన్నారు..? నిజంగా తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరిగాయా..? అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా.. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని గతంలో బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను టీటీడీ అధికారులు సైతం ఖండించారు. తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగలేదని.. అలా జరిగితే ఉపేక్షించబోమంటూ టీటీడీ కూడా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..