AP Weather: ఆంధ్రాలో వచ్చే 3 రోజులు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరపులతో వర్షాలు పడతాయని వెల్లడించింది. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో...
దక్షిణ ఛత్తీస్‌గఢ్ & పక్కనే ఉన్న తెలంగాణ పై గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ & పరిసరాల పై సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి కొనసాగుతున్నది. ఒక ద్రోణి పైన తెలిపిన ప్రాంతాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ మీదుగా అంతర్గత తమిళనాడు, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్నాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నది
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
సోమవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మంగళవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా వడ గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
సోమవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా వడ గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మంగళవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమ :-
ఆదివారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.
సోమవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. వేడి తేమ తో కూడిన అసౌకర్యమైన వాతావరణము ఒకటి లేదా రెండు చోట్ల కలగవచ్చును.
మంగళవారం :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 – 40 కి.మీ వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..