Andhra Pradesh: ఏపీలో ఆ పార్టీదే అధికారం.. సంచలన ప్రకటన చేసిన ప్రముఖ జ్యోతిష్కుడు..

Andhra Pradesh Political News: పొలిటికల్ జ్యోతిష్కుడు.. అంతకుముందు ఆయన చెప్పిన పలు జోస్యాలు అంచనాలు నిజమయ్యాయి.. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేయడం పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపింది.

Andhra Pradesh: ఏపీలో ఆ పార్టీదే అధికారం.. సంచలన ప్రకటన చేసిన ప్రముఖ జ్యోతిష్కుడు..
AP Politics
Follow us

|

Updated on: Jun 04, 2023 | 2:04 PM

Andhra Pradesh Political News: పొలిటికల్ జ్యోతిష్కుడు.. అంతకుముందు ఆయన చెప్పిన పలు జోస్యాలు అంచనాలు నిజమయ్యాయి.. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేయడం పొలిటికల్ వర్గాల్లో కలకలం రేపింది. ఇటీవల తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీ గురించి చెప్పిన ఆయన.. తాజాగా.. ఏపీ రాజకీయాల గురించి అంచనా వేయడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆ జ్యోతిష్కుడు చెప్పిన సంఖ్య, అంచనాలతోనే ఆ పార్టీ అధికారంలోకి రావడం.. పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కొన్ని నెలల ముందే అంచనా వేసిన ఆయన.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రకటన చేయడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

డిసెంబర్ కల్లా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో చండీగ‌ఢ్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ తెలంగాణలో మళ్లీ కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రభుత్వమే వస్తుందంటూ జోస్యం చెప్పారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ప్రభుత్వం గురించి కూడా రుద్ర కరణ్ పర్తాప్ అంచనా వేశారు. వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు వెళ్తున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకునేందుకు వైఎస్ఆర్ సీపీ ప్రయత్నాలు ముమ్మరం చేయగా.. దానికి చెక్ పెట్టేందుకు పలు పార్టీలతో సన్నాహాలను ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన జ్యోతిష్కులలో ఒకరైన రుద్ర కరణ్ ఏపీకి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగడం ఖాయమని ఆయన తాజాగా జోస్యం చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రుద్ర కరణ్ ట్వీట్‌ చేస్తూ..‘‘రాబోయే ఏపీ ఎన్నికలలో వైయస్ జగన్ ప్రభుత్వం తిరిగి ఎన్నికవుతుంది.. ఆంధ్రప్రదేశ్‌లో పదవీకాలం మొత్తం పూర్తిచేసుకుంటుంది’’.. అని ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే, ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ జోస్యానికి అంతకుముందు నుంచి ప్రాధాన్యత ఉంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ అలజడి, ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, యూపీ ఎన్నికల్లో బీజేపీ విజయం వంటి అనేక సంఘటనలను ఆయన ముందుగానే అంచనా వేశారు. ఈ క్రమంలోనే.. ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జోస్యం చెప్పడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..