AP Weather Alert: ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..
AP Weather Alert: నేడు కృష్ణా జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల వడ గాలులు వీచే అవకాశం ఉంది. రాబోవు రెండు రోజులలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణో గ్రతలు , సగటు ఉష్ణో గ్రతల కంటే 2 - 4 డిగ్రీ ల సెంటీగ్రేడ్ అధికం గా ఉండే అవకాశం ఉంది.
AP Weather Alert: నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణ్‌లోని ముంబయితో సహా చాలా ప్రాంతాల మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటక లోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి , గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, తమిళనాడు,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం లోని కొన్ని భాగాల లోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఏర్పడ్డాయని తెలిపింది. మరోవైపు ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టం నకు 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. దీంతో ఆంధప్రదేశ్ లో రానున్న మూడు రోజులకు వాతావరణ సూచన చేసింది వాతావరణ శాఖ..
వివిధ జిల్లాలకు ఉష్ణో గ్రత సూచన: నేడు కృష్ణా జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల వడ గాలులు వీచే అవకాశం ఉంది. రాబోవు రెండు రోజులలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గరిష్ట ఉష్ణో గ్రతలు , సగటు ఉష్ణో గ్రతల కంటే 2 – 4 డిగ్రీ ల సెంటీగ్రేడ్ అధికం గా ఉండే అవకాశం ఉంది. రాయలసీమ లో గరిష్ట ఉష్ణో గ్రతలు, సగటు ఉష్ణో గ్రతల కంటే 2 – 3 డిగ్రీ ల సెంటీగ్రే డ్ అధికం గా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
రానున్న మూడు రోజులకు వాతావరణ సూచన:
ఉత్తర కోస్తా, యానాం: ఈ రోజు ,రేపు , ఎల్లుండి (జూన్ 13వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ , వేగం తో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా: ఈ రోజు ,రేపు , ఎల్లుండి (జూన్ 13వ తేదీ) వివిధ ప్రాంతాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30-40 కి మీ , వేగం తో వీచే అవకాశం ఉంది. రాయలసీమ: ఈ రోజు ,రేపు, ఎల్లుండి (జూన్ 13వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మరిన్ని వాతావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..