AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: వాయుగండం..! వచ్చే 5 రోజులు పొట్టు పొట్టు వర్షాలు.. వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది..

నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని వాతావారణ శాఖ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారి.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rain Alert: వాయుగండం..! వచ్చే 5 రోజులు పొట్టు పొట్టు వర్షాలు.. వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Oct 22, 2025 | 7:28 PM

Share

నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 35-55కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇాదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అత్యవసర సహయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామని.. ఎవరికైనా సాయం కావాలంటే.. అధికారులను సంప్రదించాలని సూచించారు.

ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలి: హోంమంత్రి అనిత

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. ఇవాళ, రేపు అత్యంత కీలకం. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. శిధిలావస్థలో నిర్మాణాల్లో ఉండే వారిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వంటి పట్టణాల్లో డ్రైనేజి బ్లాక్స్ క్లియర్ చేసుకోవాలన్నారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను 24/7 ఆపరేట్ చేయాలని.. రోడ్డు మార్గాలకు అడ్డుగా విరిగిపడే కొమ్మలు, హోర్డింగ్స్ వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రౌండ్ లెవెల్లో విద్యుత్తు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్&బి, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని.. ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలి హోంమంత్రి అనిత సూచించారు.

బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి నెల్లూరు(జి) మర్రిపాడులో 89.2మిమీ, మొగిలిచెర్లలో 79మిమీ, కృష్ణా(జి) భవదేవరపల్లిలో 75మిమీ, ప్రకాశం(జి) ఉమారెడ్డిపల్లెలో 62.2మిమీ, గుంటూరు(జి) దుగ్గిరాలలో 61.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.

తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల వాతావరణ సూచనలు..

అల్పపీడనం.. వాయుగుండంగా మారనుందని.. దీని ప్రభావంతో తెలంగాణలో కూడా వచ్చే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది..

మీ ప్రాంతంలో వాతావరణ అప్డేట్స్ కోసం ఈ లింకును క్లిక్ చేయండి..

క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
మీకు కారు ఉందా.? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
ఇండస్ట్రీలో తోప్ హీరో.. సినిమా వస్తే పక్కా హిట్
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
మనీ ప్లాంట్ పెంపకంలో ఈ తప్పులు వద్దు.. లైట్ తీసుకుంటే సమస్యలు..
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
ఉన్నది పోయే.. ఉంచుకున్నది పోయే.. పాపం.! ఈ ఎస్సై పరిస్థితి చూస్తే
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్