Andhra: 80వేలతో ఐఫోన్ బుక్ చేస్తే.. మరొకటి ఇచ్చారు.. అమెజాన్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియాపై కన్స్యూమర్ ఫోరం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం జడ్జి జారీ చేసిన ఈ తీర్పు సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా నివాసి వీరేష్ అనే యువకుడు ఇటీవల అమెజాన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫోన్ ధర రూ. 80,000. పూర్తి మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. కానీ డెలివరీ ఓపెన్ చేసిన వెంటనే అతని ఆనందం నిరాశగా మారింది.

ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియాపై కన్స్యూమర్ ఫోరం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆంధప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం జడ్జి జారీ చేసిన ఈ తీర్పు సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా నివాసి వీరేష్ అనే యువకుడు ఇటీవల అమెజాన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫోన్ ధర రూ. 80,000. పూర్తి మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. కానీ డెలివరీ ఓపెన్ చేసిన వెంటనే అతని ఆనందం నిరాశగా మారింది. బాక్స్‌లో ఉన్నది ఐఫోన్ కాదు, ఐక్యూ బ్రాండ్ ఫోన్.. మొత్తం 80 వేలు చెల్లించి.. ఐఫోన్ బుక్ చేయగా.. తనకు అందింది మాత్రం తక్కువ విలువ గల ఫోన్ కావడంతో వీరేష్ షాకయ్యాడు. వెంటనే అమెజాన్ కస్టమర్ కేర్ ను సంప్రదించాడు. అయితే ప్రతిసారి కొత్త ప్రతినిధి మాట్లాడడం, పునరావృతమైన సమాధానాలు ఇవ్వడం, “మేము మీ సమస్యను పరిశీలిస్తున్నాం” అని మాత్రమే చెప్పడం – చివరికి ఎటువంటి పరిష్కారం లేకపోవడంతో.. బాధితుడు కన్స్యూమర్ ఫోరం ను ఆశ్రయించాడు. ఫిర్యాదులో, తాను చేసిన చెల్లింపులు, ఆర్డర్ వివరాలు, అమెజాన్‌తో జరిగిన మెయిల్, చాట్ రికార్డులు అన్నీ సమర్పించాడు. ఫోరమ్ ముందుకు వచ్చిన అమెజాన్ ప్రతినిధులు మొదట ఈ తప్పిదం జరిగిందనే విషయాన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నారని సమాచారం.. అయితే సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫోరమ్ తీర్పు స్పష్టంగా ఇచ్చింది.
తీర్పు ప్రకారం, అమెజాన్ సంస్థ బాధితుడైన వీరేష్ కు తక్షణమే ఐఫోన్ 15 ప్లస్ డెలివరీ చేయాలి. అది సాధ్యం కాని పక్షంలో రూ. 80,000 రీఫండ్ చేయాలి.. అదనంగా మానసిక క్షోభకు పరిహారంగా రూ. 25,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశం స్పష్టంగా జారీ అయినప్పటికీ, అమెజాన్ సంస్థ నుండి ఎటువంటి స్పందన లేదు..
ఫోరమ్ ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా అమెజాన్ వారు గైర్హాజరయ్యారు. అనేక సార్లు సమన్లు పంపినా, ప్రతినిధులు హాజరుకాలేదు. దీంతో ఫోరమ్ న్యాయమూర్తులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు.
చట్టాన్ని నిర్లక్ష్యం చేయడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయకపోవడం అత్యంత సీరియస్ తప్పిదమని పేర్కొంటూ, అమెజాన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ ను నవంబర్ 21 కు వాయిదా వేశారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




