హమ్మయ్యా ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం.. ఒక్కరోజులో భారీ పతనం..! కొనాలంటే ఇదే మంచి టైం..
దీపావళి తర్వాత బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అక్టోబర్22న భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఊహించని విధంగా పతనమైంది. గత కొంతకాలంగా పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఈ 2025 సంవత్సరంలో బంగారం ఊహించని రీతిలో పెరుగుతూ ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను నమోదు చేసింది. కానీ, పండుగ మర్నాడే గోల్డ్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. నాలుగు సంవత్సరాలలో ఒక్కరోజులో ఇంతటి భారీ తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఒకే రోజులో 6 శాతం కంటే ఎక్కువ పతనమైంది.

దీపావళి తర్వాత బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అక్టోబర్22న భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఊహించని విధంగా పతనమైంది. గత కొంతకాలంగా పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఈ 2025 సంవత్సరంలో బంగారం ఊహించని రీతిలో పెరుగుతూ ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను నమోదు చేసింది. కానీ, పండుగ మర్నాడే గోల్డ్ రేట్ ఒక్కసారిగా పడిపోయింది. నాలుగు సంవత్సరాలలో ఒక్కరోజులో ఇంతటి భారీ తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఒకే రోజులో 6 శాతం కంటే ఎక్కువ పతనమైంది. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూనే వస్తోంది.. భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 12,589లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 11,540లుగా ఉంది. అదే 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 9,442లకు చేరింది.
ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,890లుగా ఉంది. ఇవాళ ఉదయం మార్కెట్ ఓపెనింగ్ వరకు 10గ్రాముల బంగారం ధర రూ.1,30,720గా ఉంది. అదే నిన్(అక్టోబర్ 21న ఇది రూ.1,30,730గా ఉంది. ఈ రోజు ఉదయానికి సాయంత్రానికి బంగారం ధర భారీగా పడిపోయింది. ఈ రోజు సాయంత్రానికి బంగారం ధర 24 క్యారెట్లు గ్రాముకు 469 రూపాయలు తగ్గింది. రూ. 12, 589 వద్ద ట్రేట్ అవుతోంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ. 430 తగ్గి రూ. 11,540 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర రూ. 352 తగ్గి రూ.9,442 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 4,690 తగ్గి రూ. 1, 25, 890 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 4,300 తగ్గి రూ. 1,15,400 వద్ద కొనసాగుతోంది.. అలాగే 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,520 తగ్గి 94,420 పలుకుతోంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే బంగారం ధరలు మరింత తగ్గవచ్చునని కొందరు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గవచ్చునని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుతాయని భావిస్తున్నారు. భారతదేశం- అమెరికా, అమెరికా- చైనా మధ్య కొనసాగుతున్న సుంకాల ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. ఇది బంగారంపై పెట్టుబడి సురక్షితమైన స్వర్గధామంగా భావించే వ్యాపారులు, పెట్టుబడి దారుల డిమాండ్‌ను తగ్గిస్తోంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు 10,000 రూపాయల వరకు తగ్గవచ్చు. దీని అర్థం బంగారం ధర 1.10 లక్షల నుండి 1.15 లక్షల రూపాయలకు చేరుకుంటుందని అంచాన వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








