Vitamin B12 deficiency: ఇలాంటి లక్షణాలు ఉంటే విటమిన్ బీ 12 లోపం ఉన్నట్టే.. తస్మాత్ జాగ్రత్త!
ఈ బి 12 విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది. చివరకు ఈ విటమిన్ లోపంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. విటమిన్ బి12 లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో విటమిన్ బి12 లోపం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

విటమిన్ బి12 అనేది ఒక అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపుతుంది. శరీరం తనంతట తాను బీ12 ఉత్పత్తి చేయలేదు. అందువల్ల ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా జంతు ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. ఈ బి 12 విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది. చివరకు ఈ విటమిన్ లోపంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. విటమిన్ బి12 లోపం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో విటమిన్ బి12 లోపం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
విటమిన్ బి12 లోపం వల్ల అలసట, బలహీనత కలుగుతాయి. మానసికంగా హెచ్చుతగ్గులు అంటే మూడ్ స్వింగ్స్ ఎదుర్కొంటారు. మీరు గతంలో ఉన్నంత హుషారుగా లేకపోతే, మీకు ఆత్మ విశ్వాసం తగ్గినట్టు అనిపిస్తే, నిరాశ, నిస్సహాయత అనిపిస్తే విటమిన్ బీ12 లోపం ఉన్నట్టు గమనించాలి. వెంటనే వైద్యులను సంప్రదించడం కూడా ముఖ్యం.
విటమిన్ బి12 లోపం వల్ల జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు.. నాడీ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. దీని లోపం వల్ల తరచూ నోరు, నాలుక పగళ్లు, నొప్పి, ఎరుపు బొబ్బలు వస్తాయి. మీ కండరాలు బలహీనంగా మారుతాయి. విటమిన్ బి12 లోపం వల్ల చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుంది. జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం పడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల జుట్టు రాలుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








