AP SSC Exams: ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు.. అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో పదవ పరీక్షలు రాసే సమయం దగ్గరికొచ్చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దేవానంద్ రెడ్డి తెలిపారు.

AP SSC Exams: ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదవ తరగతి పరీక్షలు.. అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
AP INTER
Follow us

|

Updated on: Mar 29, 2023 | 5:33 PM

ఆంధ్రప్రదేశ్ లో పదవ పరీక్షలు రాసే సమయం దగ్గరికొచ్చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దేవానంద్ రెడ్డి తెలిపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు 3,449 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో 3,11,329 బాలురు కాగా..2,97,741 మంది బాలికలు ఉన్నారు. అలాగే సప్లమెంటరీ పరీక్ష కూడా 53,310 మంది విద్యార్థులు రాయనున్నట్లు పేర్కొన్నారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుంది. మొత్తం 3,449 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ఏ కేటగిరిలో 1342, బీ కేటగిరిలో1325, సీ కేటగిరీలో 682 సెంటర్లను కేటాయించామని తెలిపారు. అలాగే ఆయా ప్రాంతాల్లోని ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. విధుల్లో మొత్తం 156 ఫ్లయింగ్ స్క్వాడ్ లు ఉండనున్నారు. అలాగే కంట్రోల్ రూం ద్వారా అన్ని డిపార్ట్మెంట్ ల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోనున్నట్లు తెలిపారు. మరోవైపు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రభుత్వం అదనపు ఆర్టీసీ బస్సులు కూడా కేటాయించనుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..