AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం! నవంబర్‌ నుంచి అమలు.. యూనిట్‌పై ఎంత తగ్గిందంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. నవంబర్ నుంచి కరెంట్ చార్జీలు తగ్గనున్నాయి. ట్రూడౌన్ విధానంతో యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. సమర్థ నిర్వహణ, పవర్ స్వాపింగ్, సౌర విద్యుత్ పథకాల ద్వారా ఈ ఘనత సాధించారు. దీనితో ప్రజలకు రూ.923 కోట్ల భారం తగ్గుతుంది.

గుడ్‌న్యూస్‌.. విద్యుత్‌ ఛార్జీలు తగ్గించిన ప్రభుత్వం! నవంబర్‌ నుంచి అమలు.. యూనిట్‌పై ఎంత  తగ్గిందంటే..?
Cm Chandrababu
SN Pasha
|

Updated on: Sep 29, 2025 | 10:50 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక అడుగు పడింది. దేశ చరిత్రలో తొలి సారి ట్రూడౌన్ తో విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నవంబర్ నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు తగ్గనున్నాయి. 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించినట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల విధానానికి చెక్ పెట్టామని, స్వల్ప కాలిక కొనుగోళ్లలో ఎక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసే అవసరం లేకుండా పవర్ స్వాపింగ్ ఉపయోగపడిందని తెలిపారు.

అలాగే పిఎం కుసుమ్ స్కీంలో భాగంగా రైతులకు సౌర విద్యుత్ ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు. పిఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుతోందని, ఈ పథకంలో బీసీ వినియోగదారులకు గరిష్టంగా రూ.98 వేలు సబ్సిడీ ఇస్తున్నామని, అంతే కాకుండా 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్టీ స్టోరేజ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇలా అనేక చర్యలతో కూటమి ప్రభుత్వం సమర్ధ నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టిందని, దీంతో నేడు ట్రూడౌన్ పేరుతో కరెంటు ఛార్జీలు తగ్గుతాయని అన్నారు.

యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నవంబర్ నుంచి ట్రూ డౌన్ వర్తిస్తుందని, ఎన్నికల్లో చెప్పినట్లు ట్రూ డౌన్ ద్వారా ప్రజలకు రూ.923 కోట్ల మేర భారం తగ్గిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ రంగంలో ఇప్పటికే మార్పు మొదలైంది…ఈ మార్పు భవిష్యత్ లో మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తుంది అని ప్రజలకు వినమ్రంగా తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి