Missing Mystery: పవన్ కల్యాణ్ చొరవతో.. వీడిన యువతి మిస్సింగ్‌ మిస్టరీ.. విచారణలో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు!

ప్రేమన్నాడు.. ఆ తర్వాత పెళ్లన్నాడు. మాయ మాటలతో ట్రాప్ చేశాడు. అంతా నిజమని నమ్మిన యువతిని రాష్ట్రాల సరిహద్దులనే ధాటించేశాడు. కనిపించకుండాపోయిన బిడ్డ కోసం ఓ తల్లి చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మిస్టరీగా మారిన యువతి మిస్సింగ్‌ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు.

Missing Mystery: పవన్ కల్యాణ్ చొరవతో.. వీడిన యువతి మిస్సింగ్‌ మిస్టరీ.. విచారణలో బయటపడ్డ విస్తుపోయే వాస్తవాలు!
Pawan Kalyan On Missing Mystery
Follow us

|

Updated on: Jul 03, 2024 | 8:50 PM

ప్రేమన్నాడు.. ఆ తర్వాత పెళ్లన్నాడు. మాయ మాటలతో ట్రాప్ చేశాడు. అంతా నిజమని నమ్మిన యువతిని రాష్ట్రాల సరిహద్దులనే ధాటించేశాడు. కనిపించకుండాపోయిన బిడ్డ కోసం ఓ తల్లి చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మిస్టరీగా మారిన యువతి మిస్సింగ్‌ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు.. కేటుగాడిని కటకటాల్లోకి నెట్టారు. పాపను అమ్మ దగ్గరికి క్షేమంగా చేర్చారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపించేలా సాగిందీ స్టోరీ.

తొమ్మిది నెలల సుదీర్ఘ విచారణ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతి మిస్సింగ్‌ కేసు సుఖాంతమైంది. అదృశ్యమైన యువతిని సేఫ్‌గా ఇంటికి చేర్చారు పోలీసులు. యువతిని ట్రాప్‌ చేసి తీసుకెళ్లిన కేటుగాడిని కటకటాల్లోకి నెట్టారు పోలీసులు. అంతేకాదు, ఆ నీచుడి నిక్రుష్టపు వ్యవహారాలన్నీ బయటకు తీస్తున్నారు. ఇక,ఈ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ ఇస్తూ.. తనను అంజాద్‌ బెదిరించి తీసుకెళ్లాడంటూ.. మాచవరం పోలీసులకు పిర్యాదు చేసింది యువతి. దీంతో, అంజాద్‌పై పలు సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు పోలీసులు.

2023లో కలకలం సృష్టించినయువతి కిడ్నాప్‌

విజయవాడలో హోటల్ మేనేజ్‌మెంట్ చదువుతున్న యువతి అదృశ్యమైన వార్త.. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బిడ్డ కోసం ఆమె తల్లి ఎంతో వెతికింది. ప్రయత్నాలు ఫలించక ఎంతో ఆవేదన చెందింది. పోలీసుల కాళ్లా వేళ్లా పడింది. దర్యాప్తు చేపట్టిన ఖాకీలు.. గాలిస్తూనే ఉన్నామంటూ ఆ తల్లికి చెప్తూ వచ్చారు. అయితే, ఆమె ఇటీవల నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేయడంతో.. ఈ క్రైం స్టోరీలో స్పీడ్‌ పెరిగింది. పవన్‌ ఆదేశాలతో స్పెషల్‌ టీమ్‌ను రంగంలోకి దింపిన పోలీసులు.. యువతీయువకుల ఆచూకీని కనిపెట్టారు. జమ్మూలో ఉన్నానని యువతి లోకేషన్ పంపడంతో.. మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. యువతిని సేఫ్‌గా తల్లికి అప్పగించిన పోలీసులు.. నిందితుడు అంజాద్‌ను కటకటాల్లోకి నెట్టారు.

గతంలో యువతిని ట్రాప్‌ చేసి దొరికిపోయిన అంజాద్‌

యువతి సేఫ్‌గా ఇంటికి వచ్చినా.. విచారణలో అంజాద్ వ్యవహారమే పోలీసులను విస్తుపోయేలా చేసింది. గతంలోనూ ఓ యువతిని ఇలాగే ప్రేమ పేరుతో ట్రాప్‌చేసి తీసుకు వెళ్లిన అంజాద్, ఆమె తల్లిదండ్రులు అలెర్ట్‌ కావడంతో పోలీసులకు దొరికిపోయాడు. అయినా తన తీరు మార్చుకోక, సోషల్ మీడియాలో ప్రేమ పేరిట యువతిని ట్రాప్ చేశాడు. గత ఏడాది అక్టోబర్‌లో విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్.. అటు నుంచి కేరళ, బెంగుళూరు, మహారాష్ట్ర.. అక్కడ నుంచి జమ్మూకు తీసుకెళ్లాడు. అంజాద్ వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో.. తల్లికి ఇన్‌స్టా ద్వారా మెసేజ్ చేసింది ఆ యువతి. 9నెలలుగా తన కుమార్తె కోసం గాలిస్తున్న తల్లి శివ కుమారి.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తన బాధ చెప్పుకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వాళ్లిద్దరూ జమ్మూలో ఉన్నట్టు గుర్తించి విజయవాడకు రప్పించారు.

ఆచూకి దొరక్కుండా అంజాద్‌ జాగ్రత్తలు

ఇలాంటి మోసాల్లో ఆరితేరిన అంజాద్.. అటు తల్లిదండ్రులను, ఇటు పోలీసులను ముప్ప తిప్పలు పెట్టాడు. తమ ఆచూకీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. హైదరాబాద్‌ వెళ్లాక, ఇద్దరి ఫోన్లను, యువతి ఒంటిపై ఉన్న ఇయర్ రింగ్స్‌ను అమ్మేశాడు. తెచ్చుకున్న డబ్బులు మొత్తం ఖర్చు చేశాడు. ఆర్థికంగా భారం అవుతుండటంతో ఉద్యోగం పేరిట యువతిని రాష్ట్రాలు తిప్పుతూ వచ్చాడు. ఆమె చేతికి మొబైల్‌ ఫోన్‌ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక, అంజాద్‌ బెదిరింపులను, వేధింపులను భరించలేక, చివరకు ఎలాగోలా తన సోదరికి ఇంస్టాగ్రామ్‌లో మెసేజ్ చేసింది యువతి. అలా విషయాన్ని తల్లికి తెలిసేలా చేసింది. దీంతో అంజాద్‌ను ట్రేస్‌ చేయడం పోలీసులకు ఈజీ అయ్యింది.

అంజాద్‌ లాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రలోబాలకు, మాయమాటలకు లొంగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చొద్దని సూచిస్తున్నారు పోలీసులు. మొత్తానికి, 9నెలల సుదీర్ఘ విచారణ తర్వాత యువతి ఇంటికి చేరడం ఆ ఫ్యామిలీలో ఆనందాన్ని నింపింది. ఆమెలాంటి యువతను అలెర్ట్‌ చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు