AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!

AP News: ఈ రోజు ఉదయం పెళ్లి జరగాల్సి ఉండగా, పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులు ఆటోలో బయలుదేరారు. వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మృతులు ఆవుల అలకనంద, అంకాలు, నగేష్‌, నాగేశ్వరిగా..

AP News: కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!
Road Accident
Fairoz Baig
| Edited By: |

Updated on: Jul 03, 2026 | 6:32 AM

Share

AP News: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆటోని పెళ్లి బృందాన్ని లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు గిద్దలూరు నల్లబండ బజారుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

నల్లబండ బజారుకు చెందిన వీరక్కకు కంభముకు చెందిన పాములేటికి ఈరోజు ఉదయం 9 గంటలకు వివాహం జరగవలసి ఉంది. కంభంలోని వై జంక్షన్ వద్ద వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టేందుకు పెళ్లి బృందం ఆగిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో అలకనంద (19), అంకాలు (20, నగేష్ (17), సంఘటన స్థలంలోనే మృతి చెందగా నాగేశ్వరి (2) అనే ఏడాదిన్నర చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయపడ్డ వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు.

కాగా, ఈరోజు 3వ తేదీ శుక్రవారం ఉదయం 9;30కి వివాహం జరగవలసి ఉంది. వినాయకుడు గుడి వద్ద పెళ్లికూతురుతో కొబ్బరికాయ కొట్టిచ్చేందుకు పెళ్లి బృందం ఆగి ఉండగా, అదే సమయంలో పెళ్లి బృందాన్ని ఢీ కొట్టిన లారీ.. తర్వాత లారీ డ్రైవర్ నియంత్రణను కోల్పోయి రోడ్డు పక్కనే నిలిపి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలను, బడ్డీ బంకులను ఢీకొట్టిన లారీ ఢీకొట్టింది.

Follow Us
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం