AP New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు..! ఆశావహుల్లో ఉత్కంఠ..

Andhra Pradesh New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు డేట్‌ ఫిక్స్‌ అయ్యిందని తెలుస్తుండటంతో

AP New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు..! ఆశావహుల్లో ఉత్కంఠ..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 30, 2022 | 5:30 AM

Andhra Pradesh New Cabinet: ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు డేట్‌ ఫిక్స్‌ అయ్యిందని తెలుస్తుండటంతో ఆశావహుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. వచ్చే నెల 8న గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఆ సమావేశంలో గవర్నర్‌కు కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ గురించి వివరిస్తారు సీఎం. వచ్చే నెల 11వ తేదీ అపాయింట్‌మెంట్‌ కావాలని కోరనున్నారు. 11వ తేదీనే కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం జగన్‌ విందు ఇస్తారు. కొత్త మంత్రులకు ఒక రోజు ముందుగా మాత్రమే సమాచారం ఇవ్వనున్నారు. కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ డేట్‌ను అధికారికంగా ప్రకటించకపోయినా ఫిక్స్‌ అయినట్టేనని సమాచారం. సీఎం జగన్‌ తన కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరిస్తారని తెలిసిన నాటి నుంచి రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం మంత్రులు అందర్నీ తప్పిస్తారని మొదట్లో భావించారు. కొన్ని సమీకరణల దృష్ట్యా కొందరిని కొనసాగించాలని తర్వాత నిర్ణయించారు. పదవి నుంచి తప్పుకునే కొందరు మంత్రులకు రీజినల్‌ ఇన్‌చార్జి పదవులు ఇవ్వనున్నారు. మిగిలిన వారికి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారు.

రాజకీయ, ప్రాంతీయ, సామాజికవర్గ సమీకరణాలను బ్యాలెన్స్‌ చేస్తూ కొత్త మంత్రుల ఎంపికపై జగన్‌ కసరత్తు చేశారని చెబుతున్నారు. మంత్రి పదవుల కోసం ఆశావహులు చాలామందే ఉన్నారు. దాంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు ఒక రోజు ముందు మాత్రమే కొత్త మంత్రులకు సమాచారం ఇవ్వనున్నారు. అప్పటి వరకు సస్పెన్స్‌. మరోవైపు మంత్రి పదవుల నుంచి తప్పించడాన్ని డిమోషన్‌గా భావించవద్దని ఇప్పటికే సీఎం జగన్‌ చెప్పారు. పార్టీ బాధ్యతల ప్రాధాన్యాన్ని వివరించారు. పార్టీని మళ్లీ గెలిపించుకొని వస్తే మళ్లీ మంత్రులు కావచ్చని స్పష్టం చేశారు. మొత్తంగా ఏపీ కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read:

YS Jagan: తెలంగాణ హైకోర్టుకు ఏపీ సీఎం.. కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్‌..

Andhra Pradesh: ‘అవును నేను రౌడీనే’.. సంచలన కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్..