AP Municipal Elections Results Live: ఏపీ మున్సిపల్ ఫలితాల్లో ఫ్యాన్ హవా.. నెల్లూరు, కుప్పం వైసీపీ వశం

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2021 | 9:48 PM

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగించింది. నెల్లూరు డివిజన్‌లో ఏకంగా 54 స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేసింది అధికార పార్టీ.

AP Municipal Elections Results Live: ఏపీ మున్సిపల్ ఫలితాల్లో ఫ్యాన్ హవా.. నెల్లూరు, కుప్పం వైసీపీ వశం
Ap Municipal Results

AP Municipal Elections Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగించింది. నెల్లూరు డివిజన్‌లో ఏకంగా 54 స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేసింది అధికార పార్టీ. ముఖ్యంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డా కుప్పంలో.. ఫ్యాన్‌ సునామీకి సైకిల్‌ కుప్పకూలింది. అటు.. దర్శి మాత్రమే టీడీపీ వశమైంది. ఆకివీడులో 3, దాచేపల్లి, గురజాలలో ఒక్కో స్థానాన్ని జనసేన గెలుచుకోగా.. బీజేపీ పత్తా లేకుండా పోయింది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో 11 స్థానాలు అధికార పార్టీ వశమయ్యాయి. నెల్లూరులో 54 డివిజన్‌లలో అధికార పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది.

ఇక నిన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్న కుప్పం టీడీపీ చేజారింది. అక్కడ 25 స్థానాలకు గాను వైసీపీ 19 స్థానాల్లో గెలవగా టీడీపీ 6 స్థానాలకు పరిమితమైంది. ఇక గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోనూ వైసీపీ హవా సాగింది. దాచేపల్లిలో మొత్తం 20 స్థానాలకు గాను అధికార పార్టీ 11 వార్డులను గెలుచుకోగా 7 టీడీపీ, ఒకటి జనసేన, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఇక గురజాలలో 20 స్థానాలకు గాను వైసీపీ 16, టీడీపీ 3, జనసేన ఒక వార్డును గెలుచుకున్నాయి. ఇదిలావుంటే, ఆయా మునిసిపాలిటీల్లో 325 డివిజన్లు, వార్డులకు సోమవారం ఎన్నికలు జరిగాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Nov 2021 08:18 PM (IST)

    ఫ్యాన్‌ సునామీకి సైకిల్‌ కుప్పకూలింది

    ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగించింది. నెల్లూరు డివిజన్‌లో ఏకంగా 54 స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేసింది అధికార పార్టీ. ముఖ్యంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డా కుప్పంలో.. ఫ్యాన్‌ సునామీకి సైకిల్‌ కుప్పకూలింది. అటు.. దర్శి మాత్రమే టీడీపీ వశమైంది. ఆకివీడులో 3, దాచేపల్లి, గురజాలలో ఒక్కో స్థానాన్ని జనసేన గెలుచుకోగా.. బీజేపీ పత్తా లేకుండా పోయింది.

  • 17 Nov 2021 05:49 PM (IST)

    వైసీపీ విజయ దుందుబి..

    ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగించింది. ఒక కార్పొరేషన్‌, 12 నగర పంచాయతీలకు ప్రకటించిన ఫలితాల్లో 11 స్థానాలను కైవసం చేసుకొంది. నెల్లూరు డివిజన్‌లో ఏకంగా 54 స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేసింది అధికార పార్టీ.

  • 17 Nov 2021 04:29 PM (IST)

    చంద్రబాబుని ఇక దేవుడే రక్షించాలి...

    సాధారణ ఎన్నికల్లో ఓడితే EVMలు కారణమన్నారు. కుప్పంలో ఓడితే దొంగఓట్లు అంటున్నారు. చంద్రబాబుని ఇక దేవుడే రక్షించాలంటుూ సెటైర్లు పెల్చారు మంత్రి బొత్స.

  • 17 Nov 2021 03:04 PM (IST)

    సాకులు వెతుక్కోవడం ఆ పార్టీకి అలవాటే..

    పెనుగొండలో టీడీపీదే నైతిక విజయం అన్నారు మాజీ ఎమ్మెల్యే పార్దసారథి. ఓటమికి సాకులు వెతుక్కోవడం ఆ పార్టీకి అలవాటే అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి శంకర్‌ నారాయణ.

  • 17 Nov 2021 02:54 PM (IST)

    అధినేత అడ్డాలోనే..

    40 ఇయర్స్‌ ఇండ్రస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత అడ్డాలోనే సైకిల్‌ కుప్పకూలింది. ఫ్యాన్‌ గాలి ముందు సైకిల్‌ తట్టుకోలేకపోయింది. కనీసం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. చంద్రబాబు, లోకేష్‌ ప్రచారం చేసినా ప్రభావం కనిపించలేదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు... కుప్పంలో టీడీపీ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి.

  • 17 Nov 2021 02:53 PM (IST)

    ఢిల్లీలో చక్రం తిప్పాడు.. గల్లీలో బొక్కబోర్లా పడ్డాడు..

    ఢిల్లీలో చక్రం తిప్పాను అని చెప్పుకునే చంద్రబాబు.. కుప్పం గల్లీలో బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు MLA రోజా.

  • 17 Nov 2021 01:34 PM (IST)

    నెల్లూరు కార్పొరేషన్‌‌ వైసీపీ వైపే!

    నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలలో వైసీపీ హవా కొనసాగుతోంది. 46 డివిజన్లకు గానూ ఇప్పటిదాకా వెలువడిన 28 డివిజన్ల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీ విజయం సాధించగా, మరో 18 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. 15,14,19,27,28,33,36,44,41,46,35,29,53,4,34,26,9,18,23,39వ డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. మరోవైపు, ఇప్పటికే 8 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

  • 17 Nov 2021 01:30 PM (IST)

    వైసీపీని ఊరించిన గెలుపు

    కుప్పం మున్సిపాలిటీలోని 11వ వార్డులో గెలుపు టీడీపీ-వైసీపీ మధ్య ఊగిసలాడింది. కేవలం 6 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కస్తూరి విజయం సాధించారు. అయితే రీ కౌంటింగ్ జరపాల్సిందేనని.. ఈసారీ తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారని వైసీపీ పట్టుబట్టింది. అధికార పార్టీ డిమాండ్ మేరకు రీ కౌంటింగ్ జరిపించారు. అయితే ఈ రీ కౌంటింగ్‌లో కూడా టీడీపీ అభ్యర్థి కస్తూరి గెలుపొందారు. ఇలా వైసీపీ రెండోసారికి పట్టుబట్టి మరీ పరువు తీసుకోగా.. మళ్లీ కూడా టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

  • 17 Nov 2021 01:26 PM (IST)

    కొంపల్లిలో టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నువ్వా-నేనా?

    కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, వైసీపీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. మొత్తం 29 వార్డులకు 15 వార్డుల కౌంటింగ్ ఇప్పటి వరకూ పూర్తైంది. 15 వార్డులకు గానూ.. 8 వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. 7 వార్డులను వైసీపీ కైవసం చేసుకోగా.. 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

  • 17 Nov 2021 01:17 PM (IST)

    కాకినాడలో 4 డివిజన్లు వైసీపీ వశం

    కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో మిగిలిపోయిన 4 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. 3,9,16,30 డివిజన్లలోనూ వైసీపీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు.

  • 17 Nov 2021 01:14 PM (IST)

    డీజీపీపై టీడీపీ నేత వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు

    మున్సిపల్ ఎన్నికల తీరును విశ్లేషిస్తూ తెలుగు దేశం పార్టీ నే వర్ల రామయ్య తనదైనశైలిలో ఏపీ డీజీపీపై సెటైర్లు వేశారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి అన్ని విధాల సహకరించిన డిజీపీ సవాంగ్ గారికి అభినందనలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.ప్రతిపక్షాలు ఎన్ని ఫిర్యాదులు చేసినా, వాటిని బుట్టదాఖలు చేసి అధికార పార్టీని విజయపథంలో నడిపించిన మీ స్వామి భక్తి అనితర సాధ్యమంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో మేమిచ్చిన ఫిర్యాదులన్నిటికీ మీరు తీసుకున్న చర్యలన్నింటిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శ్వేతపత్రం రాని పక్షంలో మరోసారి మీరు కోర్టు బోనులో నిలబడాల్సి ఉంటుందన్నారు. పోలీసుశాఖ ప్రతిష్టను కూడా పణంగా పెట్టి ముఖ్యమంత్రి రుణం తీర్చుకున్న డీజీపీ గౌతం సవాంగ్ ధన్యజీవి అంటూ ధ్వజమెత్తారు.

  • 17 Nov 2021 12:57 PM (IST)

    నెల్లూరు కార్పొరేషన్‌‌లో ఫ్యాన్‌దే జోరు

    నెల్లూరు కార్పొరేషన్‌ 7 డివిజన్లలో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 14,27,28,33,39,41,53 డివిజన్లలో వైసీపీ అభ్యుర్థులు విజయం సాధించారు. మరో 32 డివిజన్లలోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 17 Nov 2021 12:33 PM (IST)

    విశాఖ 31 వ డివిజన్‌లో వైసీపీ గెలుపు

    విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 31 వ డివిజన్ లో వైసీపీ - టీడీపీ మధ్య కౌంటింగ్ హోరాహోరీగా సాగింది. చివరికి 63 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి బిపిన్ జైన్ విజయం సాధించారు.

  • 17 Nov 2021 12:31 PM (IST)

    కుప్పం మున్సిపాలిటీలో గెలుపొందిన కార్పొరేటర్లు వీరే..

    1వ వార్డు వైసీపీ అభ్యర్థి నాగరాజు 654 మెజారిటీ.

    2వ వార్డు వైసీపీ అభ్యర్థి మునిరాజు 354 మెజార్టీ

    3వ వార్డు వైసీపీ అభ్యర్థి అరవింద్ 98 మెజారిటీ

    4వ వార్డు వైసీపీ అభ్యర్థి రాజమ్మ 215 మెజారిటీ

    5వ వార్డు టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్. 156 మెజారిటీ

    7వ వార్డు వైసీపీ అభ్యర్థి నాగరాజు 300 మెజారిటీ

    8వ వార్డు వైసీపీ అభ్యర్థి చంద్రమ్మ 314 మెజారిటీ

    9వ వార్డు వైసీపీ అభ్యర్థి హఫీజ్ 77 మెజారిటీ

    10వ వార్డు వైసీపీ అభ్యర్థి మమత 276 మెజారిటీ

    11వ వార్డు టీడీపీ అభ్యర్థి కస్తూరి 6 మెజారిటీ

    12వ వార్డు వైసీపీ అభ్యర్థి మాధవి 188 మెజారిటీ

    13వ వార్డు వైసీపీ అభ్యర్థి హంస 115 మెజారిటీ

    14వ వార్డు వైసీపీ అభ్యర్థి మునస్వామి ఏకగ్రీవం.

  • 17 Nov 2021 12:27 PM (IST)

    దర్శిలో టీడీపీ కార్యకర్త సంబరాలు

    ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో 20 వార్డుల్లో 13 వార్డులు తెలుగు దేశం పార్టీ కైవసం చేసుకుంది. 7 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. దీంతో దర్శి నగర పంచాయతీపై టీడీపీ జెండా ఎగురనుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తల సంబరాలు జరుపుకున్నారు. దర్శి నగర పంచాయతీ ఛైర్మన్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తమ్ముడు పిచ్చయ్యను ముందుగానే ప్రకటించింది టీడపీ. 11వ వార్డు నుంచి పోటీ చేసిన పిచ్చయ్య ఘన విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.

  • 17 Nov 2021 12:04 PM (IST)

    కుప్పంలో కుప్పకూలిన టీడీపీ

    కుప్పం మొదటి రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తైన 14 వార్డులకుగాను 12 వార్డుల్లోనూ వైసీపీ, తెలుగు దేశం 2 వార్డుల్లో గెలుపొందాయి. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపును అధికారులు మొదలు పెట్టారు. 16 వార్డు నుంచి 25 వార్డు వరకు ఓట్ల కౌటింగ్ కొనసాగనుంది.

  • 17 Nov 2021 12:04 PM (IST)

    గురజాల వైసీపీ కైవసం

    గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసీపీ 16 వార్డుల్లో విజయం సాధించగా, తెలుగు దేశం పార్టీ 3, జనసేన ఒక చోట గెలుపొందింది.

  • 17 Nov 2021 11:57 AM (IST)

    కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో హోరాహోరీ

    కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నగర పంచాయతీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 31 వార్డులు ఉణ్న నగర పంచాయతీలో తెలుగు దేశం పార్టీ - 9 వార్డులు, వైసీపీ 7 వార్డుల్లో విజయం సాధించాయి. ఇంకా 15 వార్డుల ఫలితాలు రావాల్సిఉంది. మిగిలిన 16 వార్డులు వస్తేనే ఎవరికైనా మున్సిపాలిటీ పీఠం దక్కే అవకాశముంది.

  • 17 Nov 2021 11:54 AM (IST)

    బుచ్చిరెడ్డిపాలెం 8వ వార్డు ఫలితంపై ఉత్కంఠ

    బుచ్చిరెడ్డిపాలెం 8వ వార్డు ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ చేపట్టిన లెక్కింపులో ఒక ఓటు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే, దీనిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరారు. ఇప్పటికే రెండుసార్లు అధికారులు రీకౌంటింగ్‌ జరిపారు. అయినప్పటికీ వైసీపీ అభ్యర్థికి ఒక్క ఓటు మెజార్టీ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఎన్నికల అధికారుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అధికారులు మోసం చేశారంటూ టీడీపీ నిరసనకు దిగింది.

  • 17 Nov 2021 11:29 AM (IST)

    నెల్లూరు 39వ డివిజన్ వైసీపీ వశం

    నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలి ఫలితం వెల్లడైంది. 39వ డివిజన్ వైసీపీ అభ్యర్థి సన్ను నాగమణి 1చ390 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • 17 Nov 2021 11:09 AM (IST)

    ఏలూరు 45వ డివిజన్‌లో వైసీపీ గెలుపు

    పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పోరేషన్ 45వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ పాషా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థికి 1,117 ఓట్లు పోలవ్వగా.. టీడీపీ అభ్యర్థికి 693 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక, జనసేన అభ్యర్థికి 267 ఓట్లు, బీజేపీకి 10 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 5 ఓట్లు వచ్చాయి. ఇందులో 23 చెల్లని ఓట్లు రాగా... నోటా కింద 42 ఓట్లు పోలయ్యాయి.

  • 17 Nov 2021 11:02 AM (IST)

    మున్సిపల్‌ ఫలితాల్లో వైసీపీ జోరు

    ఏడు మున్సిపాలిటీల్లో వైసీపీ, ఒక చోట టీడీపీ గెలుపు రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలు వైసీపీవే గురజాల, దాచేపల్లిలోనూ వైసీపీ విజయం బేతంచర్ల, ఆకివీడు వైసీపీ విజయం దర్శి మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు

    దాచేపల్లి (20) వైసీపీ 11, టీడీపీ 07, జనసేన-1, స్వంతంత్ర అభ్యర్థి-1 గురజాల (20) - వైసీపీ 16, టీడీపీ 3, జనసేన 1 రాజంపేట (29) వైసీపీ 13, టీడీపీ 2 వార్డులు కమలాపురం (20) - వైసీపీ 14, టీడీపీ 2 వార్డులు బేతంచర్ల (20) - వైసీపీ 12, టీడీపీ 4 వార్డులు దర్శి (20) - టీడీపీకి 13, వైసీపీకి 7 ఆకివీడు (20) - వైసీపీ 12, టీడీపీ4, జనసేన-3, స్వంతంత్ర అభ్యర్థి -1

  • 17 Nov 2021 10:55 AM (IST)

    కుప్పంలో వైఎస్సార్‌సీపీ హవా

    కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తోంది. మొదటి రౌండ్‌లో 14 వార్డులకుగాను 14 వార్డుల్లోనూ వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే వైసీపీ ఐదు వార్డుల్లో విజయం సాధించింది. మరో 4 వార్డుల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

  • 17 Nov 2021 10:53 AM (IST)

    దాచేపల్లిలో వైసీపీ విజయకేతనం

    గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ పూర్తైంది. మొత్తం 20 వార్డులకు గానూ ఒకటి వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కాగా, మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 10 వార్డులు, టీడీపీ 7 వార్డులు, జనసేన ఒకటి, వైసీపీ రెబల్ అభ్యర్థి ఒక వార్డును కైవసం చేసుకున్నారు.

    ఆయా పార్టీలు గెలిచిన వార్డులు ఇవే...: వైసీపీ గెలిచిన వార్డులు: 1, 3, 4, 9,10, 11, 12, 13, 15, 18, 19 టీడీపీ గెలిచిన వార్డులు: 2, 5, 6, 7, 16, 17, 20 జనసేన గెలిచిన వార్డులు: 8 వైసీపీ రెబల్ అభ్యర్థి: 14

  • 17 Nov 2021 10:50 AM (IST)

    రాజంపేటలో గెలుపొందిన అభ్యర్థులు వీరే

    17వ వార్డులో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి 600 ఓట్లతో విజయం. 19 వ వార్డులో వైసీపీ అభ్యర్థి డొంక సురేశ్ గెలుపు. 21వ వార్డులో వైసీపీ అభ్యర్థి కొండా వెంకట రమణ రెడ్డి గెలుపు. 24వ వార్డులో వైసీపీ అభ్యర్థి చప్పిడి శ్వేతారెడ్డి 300 మెజార్టీతో విజయం. 4 వవార్డులో వైసీపీ అభ్యర్థి రవి 50 ఓట్లు మెజార్టీ విజయం. 13వ వార్డులో టీడీపీ అభ్యర్థి గుగ్గిళ్ల చంద్రమోళి విజయం. 27వ వార్డులో ఇండిపెండెంట్ రాఘవరాజు అత్యధిక మెజార్టీతో విజయం.

  • 17 Nov 2021 10:48 AM (IST)

    రాజంపేటలో వైసీపీదే హవా

    వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో మొత్తం 29 వార్డులకు గాను.. 20 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వైసీపీ 16 వార్డులను సొంతం చేసుకోగా.. టీడీపీ 3, ఇండిపెండెంట్ 1 వార్డును కైవసం చేసుకున్నాయి.

  • 17 Nov 2021 10:44 AM (IST)

    దర్శి నగర పంచాయతీ టీడీపీ కైవసం

    ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు టీడీపీకి 12, వైసీపీకి 7 వార్డులు దక్కాయి.

  • 17 Nov 2021 10:43 AM (IST)

    కుప్పంలో మెజార్టీ వార్డుల్లో వైసీపీ

    కుప్పంలో మెజార్టీ వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల ముందంజలో కొనసాగుతున్నారు. 10 వార్డుల్లో వైసీపీ, నాలుగు చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉంది.

  • 17 Nov 2021 10:42 AM (IST)

    బుచ్చిరెడ్డి పాలెంలో దూసుకుపోతున్న వైసీపీ

    నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం నగర పంచాయతీకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాలు. ఒకటో వార్డులో వైసీపీ అభ్యర్థి కత్తి నాగరాజు 273 ఓట్ల మెజార్టీతో విజయం.. మూడో వార్డు లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రత్యూష విజయం.. నాలుగో వార్డ్ లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మాచర్ల సుప్రజా విజయం.. 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షకీలా విజయం.. 9వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యరటపల్లి శివారెడ్డి విజయం.. 18వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయంతి విజయం..

  • 17 Nov 2021 10:38 AM (IST)

    బేతంచెర్లలో 3 వార్డుల్లో టీడీపీ గెలుపు

    కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో 13, 15, 16 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 13వవార్డు టీడీపీ అభ్యర్థిని ఎన్ కుమారి 75 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా, 15వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 92 ఓట్లతో గెలుపొందారు. 16వ వ వార్డు టిడిపి అభ్యర్థి గోపాల్ 118 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • 17 Nov 2021 10:36 AM (IST)

    దర్శిలో కొనసాగుతున్న టీడీపీ హవా

    ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఆరు వార్డుల్లో ఐదింటిని టీడీపీ కైవసం చేసుకుంది. 10, 12, 13, 14, 15 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 9వ వార్డు వైసీపీ అభ్యర్థి గెలుపొందారు.

  • 17 Nov 2021 10:33 AM (IST)

    కుప్పంలో వైసీపీ హవా

    కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ తన సత్తా చాటుతోంది. మొదటి రౌండ్‌లో 14 వార్డుల లెక్కింపునకుగాను 10 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 17 Nov 2021 10:32 AM (IST)

    దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ కైవసం

    గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్‌ను అధికారులు నిర్వహించారు. ఇప్పటివరకు వెలువడి ఫలితాల్లో అత్యధిక వార్డులను సొంతం చేసుకుంది.

  • 17 Nov 2021 10:29 AM (IST)

    కమలాపురం వైసీసీదే

    వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీ ఫలితాలు వెల్లడవుతున్నాయి. 2 వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ మోహమ్మద్ సాదిక్ 324 ఓట్లతో భారీ విజయం సాధించారు. 18 వార్డు వైసీపీ అభ్యర్థి కుప్పూరి సుదర్శన్ రెడ్డి 18 ఓట్లతో విజయం సాధిస్తే.. 3 వార్డులో వైసీపీ అభ్యర్థి షేక్ నూరి 134 ఓట్లతో గెలుపొందారు.

  • 17 Nov 2021 10:25 AM (IST)

    బేతంచెర్లలో వైసీపీ అభ్యర్థుల గెలుపు

    కర్నూలు జిల్లా బేతంచెర్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 18వ వార్డు వైసీపీ అభ్యర్ధి బుగ్గన సుశీలమ్మ 127 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే, 19వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎం పర్వీన్ 83 ఓట్ల తేడాతో గెలుపొందారు. 14 వార్డు వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రావు, 20 వార్డు వైసీపీ అభ్యర్థి జి శకుంతల విజయం సాధించారు.

  • 17 Nov 2021 10:22 AM (IST)

    గురజాలలో వైసీపీదే హవా

    గురజాల నగర పంచాయతీ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. 2 వార్డు లో 377 మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. అటు,15వ వార్డు వైసీపీ అభ్యర్థి మన్యం కన్యాకుమారి 101 ఓట్లతో గెలుపొందారు.

  • 17 Nov 2021 10:20 AM (IST)

    మున్సిపల్ ఫలితాల్లో జనసేన బోణీ

    ఏపీ మున్సిపల్ ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. మెజార్టీ సీట్లలో వైసీపీ అభ్యర్థుల విజయం సాధించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. దాచేపల్లిలో రెండు చోట్ల జనసేన అభ్యర్థుల గెలుపొందారు.

  • 17 Nov 2021 10:17 AM (IST)

    రాజంపేటలో వైసీపీ అభ్యర్థుల హవా

    రాజంపేటలో వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 13 చోట్ల వైసీపీ గెలుపొందితే, ఒక చోట మాత్రమే టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మరో చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

  • 17 Nov 2021 10:12 AM (IST)

    గురజాలలో వైసీపీ 9, టీడీపీ 1 గెలుపు

    గుంటూరు జిల్లా గురజాలలో 20 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. వైసీపీ 9, టీడీపీ 1 వార్డులో విజయం సాధించాయి.

  • 17 Nov 2021 10:09 AM (IST)

    కుప్పంలో వైసీపీ ముందంజ

    కుప్పం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అలస్యంగా మొదలైంది. పోలీసు భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 1, 2, 7 వార్డుల్లో వైసీపీ ముందంజలో ఉంది.

  • 17 Nov 2021 10:07 AM (IST)

    దాచేపల్లిలో వైసీపీ 4, టీడీపీ 6 వార్డులు

    గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్‌ను అధికారులు చేపట్టారు. ఇప్పటివరకు వెలువడి ఫలితాల్లో వైసీపీ 4, టీడీపీ 6 వార్డుల్లో విజయం సాధించాయి

  • 17 Nov 2021 10:05 AM (IST)

    పెనుగొండలో వైసీపీ హవా

    అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ లో వైసీపీ హవా కొనసాగుతోంది. 17వ వార్డు వైసీపీ అభ్యర్థి రామాంజనేయులు విజయం సాధించారు. అలాగే,18 వ వార్డు వైసీపీ అభ్యర్థి నందిని గెలుపొందారు.

  • 17 Nov 2021 10:04 AM (IST)

    గురజాల ఒకటో వార్డు వైసీపీ గెలుపు

    గుంటూరు జిల్లా గురజాల ఒకటో వార్డు వైసీపీ అభ్యర్థి లింగా చారి 456 ఓట్ల మెజార్టీతో గెలుపు

  • 17 Nov 2021 10:04 AM (IST)

    దాచేపల్లి 6వ వార్డులో టీడీపీ గెలుపు

    గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో టీడీపీ అభ్యర్థి 94 ఓట్లతో విజయం సాధించారు.

  • 17 Nov 2021 10:02 AM (IST)

    దాచేపల్లి 13వ వార్డు వైసీపీ సొంతం

    గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీలో 13వ వార్డు వైసీపీ అభ్యర్థి వందనపు లక్ష్మి 159 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 17 Nov 2021 09:57 AM (IST)

    కుప్పంలో ఓటు వేయని ప్రభుత్వ ఉద్యోగి

    కుప్పంలో మున్సిపాలిటి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్‌లో ఒక్కరంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ మొత్తం ఖాళీగా ఉండిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లేకపోవడంతో నేరుగా ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

  • 17 Nov 2021 09:55 AM (IST)

    కొవ్వూరు 23వ వార్డులో టీడీపీ విజయం

    పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు 23వ వార్డులో టీడీపీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి మురుకొండ రమాదేవి 727 ఓట్ల ఆధిక్యతతో ఘన విజయం సాధించారు. కొవ్వూరు 23వ వార్డులో మొత్తం 943 ఓట్లు పోలవగా... టీడీపీకి 828 ఓట్లు, బీజేపీకి 99 ఓట్లు, సీపీఐకి ఆరు ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి వీరబాబుకి కేవలం ఒక ఓటు మాత్రమే వచ్చింది. కాగా ఈ వార్డులో పరస్పర అవగాహనలో భాగంగా వైసీపీ పోటీలో నిలువలేదు.

  • 17 Nov 2021 09:54 AM (IST)

    విశాఖ 31, 61 వార్డుల ఓట్ల లెక్కింపు షురూ

    విశాఖపట్నం నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 31, 61 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా పరిశీలించారు. మరో రెండు గంటల్లో తుదిఫలితాలు వెల్లడవుతాయని చెప్పారరు. ప్రతీ వార్డు కౌంటింగ్ కేంద్రానికి 50 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని చెప్పారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి 8 చొప్పున టేబుల్స్‌ను ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా అన్నారు.

  • 17 Nov 2021 09:52 AM (IST)

    కమలాపురం మునిసిపాలిటీ వైసీపీ కైవసం

    వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మునిసిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ 12 వార్డుల్లో విజయం సాధించింది.

  • 17 Nov 2021 09:50 AM (IST)

    బుచ్చిరెడ్డిపాలెం 1వ వార్డు వైసీసీ కైవసం

    నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోనూ వైసీపీ అభ్యర్థుల గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 1వ వార్డులో 260 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి కత్తి శ్రీదేవి విజయం సాధించారు.

  • 17 Nov 2021 09:47 AM (IST)

    గురజాలలో వైసీపీ హవా

    గురజాల నగర పంచాయతీ పరిధిలోని 1, 2 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 20 వార్డుల్లో వైసీపీకి ఎనిమిది వార్డులు దక్కాయి. 6 వార్డుల్లో ఏకగ్రీవం కాగా, రెండు వార్డుల్లో వెలువడిన ఫలితాల్లో విజయం సాధించారు.

  • 17 Nov 2021 09:45 AM (IST)

    రాజంపేటలో 6 వార్డుల్లో వైసీపీ గెలుపు

    రాజంపేటలో మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ హవా కొనసాగుతోంది. 6 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 1, 2, 13, 15, 19, 20 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపొందారు.

  • 17 Nov 2021 09:44 AM (IST)

    కొండపల్లిలో నిలిచిన కౌంటింగ్‌

    కృష్ణాజిల్లా కొండపల్లి కౌంటింగ్‌ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో 1వ వార్డ్‌లో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. బ్యాలెట్ బాక్స్‌ సీల్ సరిగ్గా లేదని ఇండిపెండెంట్‌ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ పూర్తి అయ్యాక సీల్ వేసినప్పుడు పెట్టిన సంతకం ఇప్పుడు మారిందని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎన్నికల ఉన్నతాధికారులు బ్యాలెట్ బాక్సులను పరిశీలిస్తున్నారు.

  • 17 Nov 2021 09:25 AM (IST)

    నెల్లూరు జిల్లాలో బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు

    నెల్లూరు జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించి ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కస్తున్నారు.

  • 17 Nov 2021 09:23 AM (IST)

    రాజంపేట 2వ వార్డులో వైసీపీ

    రాజంపేట 2వ వార్డులో వైసీపీ అభ్యర్థి మౌనిక గెలుపొందారు.

  • 17 Nov 2021 09:22 AM (IST)

    కమలాపురం 15వార్డులో వైసీపీ గెలుపు

    కమలాపురం 15వార్డులో వైసీపీ అభ్యర్థి చవారెడ్డి సంధ్యారాణి 129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

  • 17 Nov 2021 09:19 AM (IST)

    పెనుగొండలో ఒకే ఒక పోస్టల్ బ్యాలెట్

    అనంతపురం జిల్లా పెనుగొండలో కౌంటింగ్‌ ప్రక్రియ కాస్త అలస్యంగా మొదలైంది. ఇక్కడ ఒకే ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదైంది. ఆ ఒక్క ఓటు 16 వార్డు వైసీపీ అభ్యర్థికి దక్కడం విశేషం.

  • 17 Nov 2021 09:17 AM (IST)

    బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ అధిక్యం

    నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో మొత్తం 114 పోస్టల్‌ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి - 66, టీడీపీకి - 20, బీజేపీకి - 27, CPMకు ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి.

  • 17 Nov 2021 09:16 AM (IST)

    కమలాపురం 11వ వార్డులో వైసీపీ విజయం

    కమలాపురం 11వ వార్డులో 250 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. కమలాపురంలో మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అందులో ఒక వార్డులో వైసీపీ గెలుచుకుంది.

  • 17 Nov 2021 09:08 AM (IST)

    ఏలూరు 45వ డివిజన్ కౌంటింగ్ షురూ

    పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజ్ పి జి బ్లాక్‌లో కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సజావుగా సాగుతున్న కౌంటింగ్ కొనసాగుతోంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూం ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్లు సపరేట్ చేస్తున్నారు ఎన్నికల సిబ్బంది. మరో రెండు గంటల్లో దాదాపుగా ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 15న జరిగిన 45వ డివిజన్ కార్పొరేటర్ కోసం ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. 45 వ డివిజన్‌లో మొత్తం 3,594 మంది ఓటర్లు గాను పురుషు - 1,038, మహిళలు - 1119, మొత్తం 2157 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 17 Nov 2021 09:03 AM (IST)

    రాజంపేట కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    రాజంపేట కౌంటింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్‌ కేంద్రం దగ్గరకు వచ్చిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెంగల్‌ రాయుడును అనుమతి లేదంటూ పోలీసులు వెనక్కి పంపించి వేశారు. దీంతో పోలీసులకు, చెంగల్ రాయుడు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అధికారులు సర్ధి చెప్పడంతో చివరకు చెంగల్ రాయుడు వెనుదిరిగారు.

  • 17 Nov 2021 08:53 AM (IST)

    ఏపీ మోడల్ స్కూల్‌లో దర్శి కౌంటింగ్

    ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీకి సంబంధించిన కౌటింగ్ ప్రక్రియ.. ఏపీ మోడల్ స్కూల్‌లో ప్రారంభమైంది. 19 వార్డులకు కౌంటింగ్ కోసం 38 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 100 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

  • 17 Nov 2021 08:51 AM (IST)

    తొలిఫలితం 11 గంటలకు..!

    ఏపీలో మిగిలిన మున్సిపల్, నగర పంచాయతీలకు సంబంధించిన కౌటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ హాల్ కు బ్యాలెట్ బాక్సులు తరలించిన అధికారులు.. మొదటగా ఓట్లను వేరు చేసి కట్టలు కడుతున్నారు కౌంటింగ్ సిబ్బంది. తొలిఫలితం 11 గంటలకు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తున్నారు పోలీసులు. మరోవైపు కౌంటింగ్‌కు పకడ్భందీ చర్యలు తీసుకున్నామని.. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

  • 17 Nov 2021 08:47 AM (IST)

    బేతంచర్లలో కొనసాగుతున్న కౌటింగ్

    కర్నూలు జిల్లాలోని బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్ మొదలైంది. మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 20 వార్డులకు గాను 20 టేబుళ్ల ఏర్పాటు చేశామన్న అధికారులు.. ఒకటే రౌండ్‌లో ఓట్ల లెక్కింపు ముగియనుంది. దాదాపు 11 గంటలలోపే పూర్తి ఫలితాలు వెలువడవచ్చని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

  • 17 Nov 2021 08:44 AM (IST)

    వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ చిత్రీకరణలో కౌటింగ్

    అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు ఎన్నికల అధికారులు.

  • 17 Nov 2021 08:39 AM (IST)

    పెనుగొండలో మొదలుకాని కౌంటింగ్

    అనంతపురం జిల్లా పెనుగొండలో కౌంటింగ్ ప్రక్రియకు అలస్యమవుతోంది. కౌంటింగ్ సూపర్‌ వైజర్లు సమయానికి హాజరు కాకపోవడంతో ఓట్ల లెక్కింపునకు సమయం పట్టే అవకాశముంది. అయితే, అభ్యర్థుల ఫిర్యాదు మేరకు రిజర్వులో ఉన్న సిబ్బందితో కౌంటింగ్‌ను ప్రారంభించారు ఎన్నికల అధికారులు

  • 17 Nov 2021 08:36 AM (IST)

    పల్నాడు పోరులో గెలుపెవరిదో..?

    గుంటూరు జిల్లాలో రెండు నగర పంచాయతీలు పల్నాడు ప్రాంతంలోనే ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి మధ్య గట్టి పోటీ ఉంది. దాచేపల్లి, గురజాలలో 20 వార్డుల చొప్పున ఉన్నాయి. గురజాలలో ఆరు ఏకగ్రీవం అయితే అన్నీ వైసీపీకే వచ్చాయి. దాచేపల్లిలో ఒకటి వైసీపీకి ఏకగ్రీవంగా వచ్చింది. ఈ రెండు చోట్లా 11 వార్డులు వచ్చిన పార్టీ నగర పంచాయతీలో గెలిచినట్లే.

  • 17 Nov 2021 08:34 AM (IST)

    ఆకివీడులో పోటీ ఆసక్తి

    ఆకివీడులో పోటీ ఆసక్తిగా ఉంది. ఇక్కడ టీడీపీ, జనసేన, లెఫ్ట్‌ కలిసి పోటీ చేశాయి. మొత్తం 20 వార్డుల్లో వైసీపీ పోటీ చేసింది. పొత్తులో భాగంగా టీడీపీ 14, జనసేన 5 చోట్లా, సీపీఎం ఒక చోట పోటీ చేశాయి.

  • 17 Nov 2021 08:09 AM (IST)

    కుప్పం మున్సిపల్‌పైనే అందరి దృష్టి

    చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కౌంటింగ్‌పై సర్వత్ర టెన్షన్ నెలకొంది. తొలిసారిగా జరుగుతున్న కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల్లో పరువు కోసం టీడీపీ, పట్టు కోసం వైసీపీ ప్రయత్నించాయి. మొత్తం 25 వార్డుల్లో ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది. 14 వ వార్డులో వైసీపీ అభ్యర్థి మునుస్వామి ఏకగ్రీవమయ్యారు. మరికాసేపట్లో 24 వార్డుల్లో లెక్కింపు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం కుప్పంలోని ఎంఎఫ్ సీ ప్రభుత్వ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి నియామించింది ఎస్ఈసీ.

    బరిలో ఉన్న 87 మంది అభ్యర్థులు నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 76.49. లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు. మొత్తం ఓటర్లు 39,259 మంది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు - 28942 ముంది.

  • 17 Nov 2021 08:00 AM (IST)

    కాకినాడలో త్రిముఖ పోటీ!

    కాకినాడ మున్పిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3,9,16,30 డివిజన్లకు జరిగిన ఉపఎన్నికల పోలింగ్ కు సంబంధించి ఇవాళ కౌటింగ్ నిర్వహిస్తున్నారు. మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపునకు 12 టేబుళ్లు ఏర్పాటు చేశారు అధికారులు. 9, 16వ వార్డులో వైసీపీ, టీడీపీ, బీజెపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 30వ డివిజన్ లో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంది. ఇక, బీజేపీకి మద్దపు తెలిపిన జనసేన.. రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు..

  • 17 Nov 2021 07:58 AM (IST)

    రంగరాయ మెడికల్ కాలేజ్‌లో కౌటింగ్ ఏర్పాట్లు

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మున్పిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు డివిజన్ల ఉపఎన్నికల కౌంటింగ్ మొదలవుతోంది. ఈనెల 15న జరిగిన పోలింగ్ నిర్వహించగా, ఇవాళ కౌటింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపునకు 12 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 51శాతం పోలింగ్ నమోదు కావడంతో మధ్యాహ్నంకు కౌంటింగ్ పూర్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Published On - Nov 17,2021 7:51 AM

Follow us
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి