AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా.. అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్సులకు ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది… షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే బుధవారం రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఏపీ సర్కార్ భావించింది.
Andhra Pradesh Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది… షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే బుధవారం రోజు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఏపీ సర్కార్ భావించింది. కానీ, అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది. మొత్తం 14 బిల్లులను కేబినెట్ ముందుకు ప్రభుత్వం తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ బిల్లులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్సులు ఆమోదానికి రానున్నాయి.
ఇదిలావుంటే, డిసెంబర్‌లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. కీలక ఆర్డినెన్సులు అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి రానున్నాయి. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఒకే రోజున 14 ఆర్డినెన్సులు అసెంబ్లీ, మండలి ముందుకు రానున్నాయి.
ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ, ఏపీ హైయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులెటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చట్ట సవరణలు ఆమోదానికి రానున్నాయి. ఏపీ విద్యాశాఖ చట్ట సవరణ ఏపీ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్,ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్ట సవరణ, చట్ట రెండో సవరణ ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ చట్ట సవరణ ఆర్డినెన్సులు ఆమోదానికి రానున్నాయి. ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ బొవైన్ బ్రీడింగ్ చట్ట సవరణ, సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్స్ కో కంట్రిబ్యూటరీ పెన్షన్ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల చట్ట సవరణ, సినిమా నియంత్రణ చట్ట సవరణ ఆర్డినెన్సులు కూడా ఆమోదానికి రానున్నాయి.
ఇక, మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కాగా, రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది ప్రత్యక్షంగా ఉద్యోగవకాశాలు రానున్నాయి. కంపెనీల ఏర్పాటుకు భూముల కేటాయింపు, పరిశ్రమలకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించనట్లు సమాచారం.
Read Also.. Heavy Rain Alert: ముంచుకొస్తున్న వాయుగుండం.. నేడు, రేపు భారీ వర్షాలు.. ఏడు రాష్ట్రాలకు అలెర్ట్..