AP MLC Elections: వైసీపీకి షాక్.. పట్టభద్రుల ఎన్నికల్లో రెండు స్థానాలు టీడీపీ కైవసం.. చెల్లని ఓట్లు ఎన్నో తెలుసా

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం ఎదురుగాలి వీచింది. టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టంగట్టారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపుని సొంతం చేసుకున్నారు

AP MLC Elections: వైసీపీకి షాక్.. పట్టభద్రుల ఎన్నికల్లో రెండు స్థానాలు టీడీపీ కైవసం.. చెల్లని ఓట్లు ఎన్నో తెలుసా
Tdp Graduate Mlcs
Follow us

|

Updated on: Mar 18, 2023 | 7:58 AM

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి పట్టభద్రులు షాక్ ఇచ్చారు. శాసన మండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరించి విజయకేతనం ఎగురవేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా గ్రాడ్యుయేట్ స్థానాల్లో మాత్రం ఎదురుగాలి వీచింది. టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు పట్టంగట్టారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు గెలుపుని సొంతం చేసుకున్నారు. అంతేకాదు పశ్చిమ రాయలసీమలో మాత్రం ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది.. రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఎక్కువగా ఫలితాలు వెల్లడయ్యాయి.

తూర్పు రాయలసీమలో..

తూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ విజయం సాధించడంతో  టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్పష్టమైన ఆధిక్యంతో గెలుపుని సొంతం చేసుకోవడంతో చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో టిడిపి శ్రేణుల భారీ ర్యాలీని నిర్వహించారు. పోలీసుల ఆంక్షలు లెక్కచేయకుండా టిడిపి కార్యకర్తలు ర్యాలీని నిర్వహించారు. మరోవైపు పలమనేరులో తెలుగు తమ్ముళ్ళ సంబరాలు చేసుకున్నారు. మదనపల్లి బెంగళూరు బస్టాండ్ లో బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు టీడీపీ మైనారిటీల నేతలు. రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ .. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్‌రెడ్డిపై విజయాన్ని సొంతం చేసుకున్నారు. కంచర్ల శ్రీకాంత్‌  1,12,686 ఓట్లు సాధించగా.. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85,423 ఓట్లు వచ్చాయి. అర్ధరాత్రి వరకూ రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు కొనసాగింది. అయితే శ్రీకాంత్ విజయాన్ని రిటర్నింగ్‌ అధికారి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఉత్తరాంధ్రలో  

మరోవైపు ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90% తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో సాధించారు. టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు విజయం సాధించినా ఇంకా ఎన్నికల రిటర్నింగ్ అధికారి డిక్లైర్ చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ కు సమాచారం ఇచ్చి..  రేపు అప్పుడు విజేతను ప్రకటిస్తామనడంపై టీడీపీ నేతల అభ్యంతరం చెబుతున్నారు. అంతేకాదు  డిక్లేర్ చేస్తేనే ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్తామంటున్న విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు  స్పష్టం చేశారు. అప్పటిదాకా కౌంటింగ్ సెంటర్ లోనే ఉంటామని అక్కడే ఉన్నారు చిరంజీవి రావు.

చిరంజీవి కి ఓటు – సామాన్యుడికి చోటు అన్న చిరంజీవి 

చిరంజీవి రావు విజయాన్ని ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి  జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్.  చిరంజీవి రావుకు వచ్చిన ఆధిక్యతను ఎన్నికల కమిషన్ కు నివేదించి వాళ్ళ అనుమతి తో విజేత గా ప్రకటించామని జిల్లా కలెక్టర్ చెప్పారు. దీంతో TV9 తో ఎమ్మెల్సీ గా విజయం సాధించిన చిరంజీవి రావు మాట్లాడుతూ.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని కుటుంబం మాదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలు నచ్చక, చంద్రబాబు పరిపాలనా దక్షత పై అపార నమ్మకంతో టీడీపీ లో చేరి ఎమ్మెల్సీ గా పోటీ చేశానని చెప్పారు. చిరంజీవి కి ఓటు – సామాన్యుడికి చోటు అనే నినాదాన్ని బలంగా తీసుకెళ్లామని తెలిపారు.

నా విజయం లో టీడీపీ ది 98 శాతం అయితే, నా ఇమేజ్ 2 శాతం మాత్రమేన్నారు. తాను ఆశించిన వ్యవస్థల్లో మార్పు కోసం కృషి చేస్తానని ప్రకటించారు చిరంజీవి రావు. అధ్యాపకునిగా తనకున్న మంచి పేరును చెడగొట్టుకోకుండా రాజకీయాలు చేస్తానని వేపాడ చిరంజీవి రావు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు మొదలైనప్పటి నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు.. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. మొదటి రౌండ్‌ నుంచి టీడీపీ అభ్యర్థి ఆధిక్యం చూపించారు. మరోవైపు సిటింగ్‌ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్థి మాధవ్‌ సహా 34 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

పట్టభద్రుల ఎన్నికల్లో చెల్లని ఓట్లు.. 

డిగ్రీ లేదా అంతకు మించి చదివిన వారు మాత్రమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకుంటారు. ఆయితే చదువుకున్న వారు పాల్గొనే ఎన్నికల్లో సైతం చెల్లని ఓట్లు పోలయ్యాయి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,979 చెల్లని ఓట్లు పోలవడం విశేషం..

మరోవైపు పశ్చిమ రాయలసీమలో టిడిపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా… నేనా అన్నట్లు సాగుతుంది.. తుది ఫలితం ఇంకా వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువు దీరిన అల్లు అర్జున్ విగ్రహం
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
నిర్మాతగా మారనున్న సందీప్ రెడ్డి వంగ.. వారితో కొత్త సినిమా
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. అదుపులో మరో ఇద్దరు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ఈడీ కస్టడీ పొడిగింపు..
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ.. లైవ్ వీడియో
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఎస్‌బీఐ డెబిట్ కార్డుదారులకు షాక్..నయా రూల్స్‌తో చార్జీల బాదుడు
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
ఐపీఎల్ టాప్-2 స్కోర్ల మ్యాచుల్లో ఆడిన ఏకైక ఆటగాడు ఎవరంటే?
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
కలలో బంగారం కనిపించిందా.? దాని అర్థం ఏంటంటే..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండాలా.. ఈ మంత్రాలను పఠించండి..
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?
రామ్ చరణ్ బర్త్ డే రోజున ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా?