AP Local Body Elections: రేపటి నుంచి వచ్చే నెల 21 వరకు పోలీసులకు వీక్‌ఆఫ్‌లు, లీవ్‌లు రద్దు: డీజీపీ కార్యాలయం
AP Local Body Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో భాగంగా పలు ఉద్యోగులకు సెలవులు రద్దు అయ్యాయి....
AP Local Body Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో భాగంగా పలు ఉద్యోగులకు సెలవులు రద్దు అయ్యాయి. ఇక పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీసులకు వీక్‌ఆఫ్‌లు, లీవ్‌లు రద్దు అయ్యాయి. ఈ సెలవులను బుధవారం నుంచి వచ్చే నెల 21 వరకు రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసినట్లు ఏపీ డీజీపీ కార్యాలయం తెలిపింది.
కాగా, ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల రీషెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల అంశం కోర్టులో ఉండటంతో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికల ప్రక్రియలో అడ్డంకుల కారణంగా పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నారు.