AP Floods: ఏపీలో వర్ష బీభత్సం.. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వంకలు, వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేసింది. 

AP Floods: ఏపీలో వర్ష బీభత్సం.. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
AP Heavy Rains and Floods
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 02, 2024 | 11:14 AM

AP Telangana Floods: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వంకలు, వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  కొన్ని కీలక సూచనలు చేసింది.

🔺 వరదల సమయంలో/ During floods

• వరదనీటిలోకి ప్రవేశించవద్దు. • మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి. • విద్యుద్ఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి. • ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్ ను గుర్తించి ఆ ప్రదేశంలొ కనిపించే విధంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి. • వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి. • తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ప్లేట్/కవర్ తో మూసి ఉంచండి. • వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి. • మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి.

🔺 వరదల తరువాత/After Floods

• మీ పిల్లలను నీటిలోకి గాని మరియు వరద నీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి. • దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని తనిఖీ చేయండి. • అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను మరియు ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయండి. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు. • విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు తీగలు, పదునైన వస్తువులు మరియు శిధిలాలను నిశితంగా పరిశీలించండి. • వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినవద్దు. • మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి. • వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రధమ చికిత్స తెలుసుకోండి. • నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి. • నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.

🔺 మీరు ఖాళీ చేయవలసి వస్తే/ If you need to evacuate

• మంచం మరియు టేబుళ్లపై మీ ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలను పెట్టండి. • మీ కరెంట్ మరియు గ్యాస్ కనెక్షన్ ను ఆపివేయండి • ఎత్తైన భూ ప్రదేశం / సురక్షిత ఆశ్రయానికి వెళ్లండి. • మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాలు లను తీసుకొని వెళ్ళండి. • లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించవద్దు, నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి. • అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి. • కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి. • తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.

దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
దైవ దర్శనానికి వచ్చి విగతజీవులుగా మారిన కుటుంబం..!
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు