AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం.. గరిష్టంగా ఎంతంటే..

మొత్తం 210 బీటెక్‌ కాలేజీలతో పాటు, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన ఫీజుల వివరాలను తెలిపారు. రూ. లక్షకుపైగా ఫీజులు నిర్ణయించిన కాలేజీలు 8 కాలేజీలు ఉండగా, రూ. 40 వేల ఫీజులున్న కాలేజీలు 114 ఉన్నాయి. ఇక రెండు ఆర్కిటెక్చర్‌ కళాశాలలకు రూ.35 వేల చొప్పున ఫీజును ఖరారు చేశారు. ట్యూషన్‌ ఫీజుతో పాటు ఐడెంటి కార్డు, మెడికల్ ఖర్చులు...

Andhra Pradesh: ఇంజినీరింగ్‌ ఫీజులు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం.. గరిష్టంగా ఎంతంటే..
Engineering Colleges
Narender Vaitla
|

Updated on: Jul 08, 2024 | 7:37 AM

Share

ఇంజినీరింగ్‌ ఫీజులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఏడాదికి గాను ఫీజులు ఖరారు చేశారు. ఇందులో భాగంగా బీటెక్‌తో పాటు, ఆర్కిటెక్చర్‌ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి ఫీజులను ఖరారు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజనీరింగ్ కోర్సుల విషయానికొస్తే కాలేజీలు అత్యధికంగా రూ. 1.03 లక్షల నుంచి రూ. 1.05 లక్షల వరకు ఫీజులు వసూలు చేయొచ్చనని ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక అత్యల్పంగా రూ. 40 వేల చొప్పున నిర్ణయించారు.

మొత్తం 210 బీటెక్‌ కాలేజీలతో పాటు, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్ కాలేజీలకు సంబంధించిన ఫీజుల వివరాలను తెలిపారు. రూ. లక్షకుపైగా ఫీజులు నిర్ణయించిన కాలేజీలు 8 కాలేజీలు ఉండగా, రూ. 40 వేల ఫీజులున్న కాలేజీలు 114 ఉన్నాయి. ఇక రెండు ఆర్కిటెక్చర్‌ కళాశాలలకు రూ.35 వేల చొప్పున ఫీజును ఖరారు చేశారు. ట్యూషన్‌ ఫీజుతో పాటు ఐడెంటి కార్డు, మెడికల్ ఖర్చులు, స్పోర్ట్స్‌, కల్చరల్‌ ఈవెంట్స్‌ వంటి ఖర్చులన్నీ ఇందులోకే వస్తాయని తెలిపారు.

హాస్టల్‌, ట్రావెల్‌, మెస్‌, రిజిస్ట్రేషన్‌, రిఫండబుల్ ఫీజులు ఇందులోకి రావు. ఆ ఖర్చులు కాలేజీలు నిర్ణయించిన విధంగా అదనంగా ఉంటాయి. నిర్ణయించిన ఫీజులకు అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేస్తే చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఫీజులు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో అత్యధిక ఫీజులు నిర్ణయించిన కాలేజీల్లో గుంటూరులోని ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్‌ విద్యా సంస్థలు, విజయవాడలోని ప్రసాద్‌ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్‌ సిద్దార్థ, భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజి ఫర్‌ ఉమెన్‌ కళాశాలలకు రూ.1.05 లక్షల చొప్పున ఉన్నాయి. ఇక విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి రూ.1.03 లక్షలుగా ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజు రూ.93,700గా నిర్ణయించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!