Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. స్పెషల్ పే పెంచుతూ ఉత్తర్వులు
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. స్పెషల్ పే పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 11వ పీఆర్సీ సిఫార్సులు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం నిర్ణయంతో 1,2 కేటగిరిలకు మినహా మిగిలిన అన్ని కేటగిరి ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. స్పెషల్ పే పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 11వ పీఆర్సీ సిఫార్సులు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం నిర్ణయంతో 1,2 కేటగిరిలకు మినహా మిగిలిన అన్ని కేటగిరి ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. అయితే ఈ ఉత్తర్వులు జులై నుంచి అమలులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో వారి స్థాయిలను బట్టి ఈ పెంపు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
ఏ స్థాయి వారికి ఎంత పెంచుతున్నామన్నది కూడా ఈ ఉత్తర్వుల్లో వివరాలు సమర్పించినట్లు పేర్కొంది. శాఖలతోపాటు, ముఖ్యమంత్రి పేషీలో పనిచేస్తున్న వారి వివరాలు కూడా వివరించింది. 11వ ఆర్థిక సంఘం కాలపరిమితి ఈ నెలాఖరుతో పూర్తవుతున్న తరుణంలో ఉద్యోగాల స్పెషల్ పెంపు ఉత్తర్వులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
