Kappala Pelli: భాజా బజంత్రిలు.. శుభలేఖలు.. వర్షాల కోసం కప్పలకు పెళ్లి.. ఈ వేడుక కోసం..
Andhra Pradesh: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో మంగళవారం ఘనంగా కప్పల పెండ్లి జరిపించారు. కప్పలకు పెండ్లి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అచ్చు మనుషుల పెళ్లిలానే వీటికి వివాహం జరిపించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా, జూన్ 15: ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం లాంటివి గ్రామాల్లో చేస్తుంటారు. మరికొన్నిచోట్ల వర్షాల కోసం వరుణయాగం, కబడ్డీ ఆటలు, పాటలు పాడటం చేస్తారు. కప్పలకు పెళ్లి చేస్తే దేవ దేవేంద్రుడి కరుణతో వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో కప్పలకు ఈ వింత పెళ్లి చేస్తుంటారు. తాజాగా వరుణుడి కటాక్షం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో మంగళవారం ఘనంగా కప్పల పెండ్లి జరిపించారు. కప్పలకు పెండ్లి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అచ్చు మనుషుల పెళ్లిలానే వీటికి వివాహం జరిపించారు. పూర్తి సంప్రదాయ పద్దతిలో శాస్త్రోక్తంగా ఈ వివాహం జరిపించారు. కప్పలను వధూవరుల మాదిరిగానే అలంకరించి.. తాళి బొట్టు, పూల దండలు మార్చుకోవడం, సప్తపది, తలంబ్రాలు అన్నీ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.
కోనసీమ సంతోషిమాత అమ్మవారి ఆలయం దగ్గర పురోహితులు పెద్దింటి రామం కమిటీ సభ్యులు బండారు లక్ష్మణ్, గ్రామస్తులు ఆద్వర్యంలో వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురవాలని కప్పలకు పెళ్ళి చేసి పూజలు నిర్వహించారు.పెళ్ళి అనంతరం వాటిని ఊరంతా ఊరేగింపు నిర్వహించారు. పురోహితుడు ఆధ్వర్యం లో మహిళలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కప్పలకు పెళ్లి చేసి ఊరంతా ఊరేగిస్తే వర్షాలు కురుస్తాయి అంటున్న గ్రామస్తులు..
రోహిణి కారై వెళ్లినా కూడా ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో వర్షాలు కురవడం కోసం కప్పలకు పెళ్ళి చేసినట్లుగా కొత్తపేట మండలం వాడపాలెంలో స్థానికులు తెలిపారు. పూర్వం కప్పలకి పెళ్లి చేసి ఊరంతా ఊరేగింపుగా ఉరేగిస్తే వర్షాలు కురిసేవనీ ఇదే తరహాలో వాడపాలెం కప్పలకు పెళ్ళి చేసినట్లు చెప్తున్నారు గ్రామస్తులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
