Plastic Rice: అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్లాస్టిక్ రైస్ సప్లై అంటూ వార్తలు… క్లారిటీ ఇచ్చిన ఏపీ సర్కార్

అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు పంపిణీ చేసే బియ్యం కల్తీ అవుతున్నాయని, అవి ప్లాస్టిక్ బియ్యం అంటూ వస్తున్న...

Plastic Rice: అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్లాస్టిక్ రైస్ సప్లై అంటూ వార్తలు... క్లారిటీ ఇచ్చిన ఏపీ సర్కార్
Plastic Rice
Follow us

|

Updated on: Aug 09, 2021 | 8:55 PM

అంగన్వాడీల ద్వారా గర్భిణులకు, చిన్నారులకు పంపిణీ చేసే బియ్యం కల్తీ అవుతున్నాయని, అవి ప్లాస్టిక్ బియ్యం అంటూ వస్తున్న వార్తలపై ఏపీ సర్కార్ స్పందించింది.  అవి ప్లాస్టిక్ బియ్యం కాదని.. ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధకమైన బియ్యం) అని స్పష్టత ఇచ్చింది. సాధారణ బియ్యానికి.. విటమిన్లు,  ఖనిజాలు జోడించడం ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ తయారవుతాయని వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ నెల నుంచి సమీకృత శిశు అభివృద్ది పథకం, మధ్యాహ్న భోజన పథకం కోసం ఫోర్టిఫైస్ రైస్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. ఈ బియ్యం గర్భిణీ స్త్రీలకు, బాల బాలికలకు కీలక సూక్ష్మ పోషకాలు అందజేస్తాయని ప్రభుత్వం తెలిపింది. పోషాకాహార లోపాలను అధికమించేందుకు ఈ బియ్యం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. అక్కడక్కడా ఈ బియ్యం గింజలు ప్లాస్టిక్ బియ్యంలా కనబడతాయని, అపోహపడకుండా ఈ బలవర్ధమైన బియ్యాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొంది.

ఈ బియ్యం గురించి క్షేత్ర స్థాయి సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోడం వల్లనే ప్రజలు అపోహపడుతున్నారని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు గర్భిణీలకు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు, వాలంటీర్లు ఈ బియ్యంపై ప్రజల్లో అపోహలు తొలగించాలని.. వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read:జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పెళ్లిళ్లు, సభలు, సమావేశాలకు లిమిట్… అతిక్రమిస్తే

ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విద్యాశాఖ మంత్రి.. స్కూల్స్ పున: ప్రారంభంపై కూడా క్లారిటీ