YS Jagan: అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్ష నేత దూరం.. ఇవాళ పులివెందులకు మాజీ సీఎం జగన్
ఘోర పరాజయం నుంచి కోలుకుంటోన్న వైసీపీ, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓటమి భాధతో కుంగిన నేతలకు ధైర్యం చెప్పారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లండి, బాధితులకు అండగా నిలవండి అంటూ యాక్షన్ ప్లాన్‌ను వివరించారు.

ఘోర పరాజయం నుంచి కోలుకుంటోన్న వైసీపీ, భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓటమి భాధతో కుంగిన నేతలకు ధైర్యం చెప్పారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లండి, బాధితులకు అండగా నిలవండి అంటూ యాక్షన్ ప్లాన్‌ను వివరించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో పర్యటించాలని నేతలకు సూచించారు.
ఈ క్రమంలోనే వైఎస్ జగన్ శనివారం సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. జూన్ 22న ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి పులివెందుల వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ఇక, పులివెందుల టూర్‌లోనూ ఉమ్మడి కడప జిల్లా వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఓటమితో నిరాశలో ఉన్న శ్రేణులకు ధైర్యం చెప్పడంతోపాటు.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. పులివెందుల పర్యటనలో స్థానిక నేతలందరినీ కలుస్తారు వైఎస్ జగన్.
ఇదిలావుంటే, ఏపీ శాసనసభ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్టు సమాచారం. కాగా, మూడు రోజుల పాటు జగన్ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..