Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Employees: ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోన్న ఏపీ ఉద్యోగులు.. రాజీ ప్రసక్తే లేదని స్పష్టం..

AP Employees: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ సంఘాలు వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పాయి. పీఆర్‌సీ అమలుపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి....

AP Employees: ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోన్న ఏపీ ఉద్యోగులు.. రాజీ ప్రసక్తే లేదని స్పష్టం..
Ap Employees
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 06, 2021 | 6:52 PM

AP Employees: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ సంఘాలు వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పాయి. పీఆర్‌సీ అమలుపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఉద్యోగుల సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. పీఆర్‌సీ సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. ప్రభుత్వం పీఆర్‌సీ అమలు విషయంలో కాలయాపన చేస్తుందన్న కారణంతో ఉద్యమ కార్యచరణను ప్రకటించాయి. అయితే విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రేపటి నుంచి (డిసెంబర్‌ 7) నుంచి కార్యా చరణకు దిగుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ నేతలు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రభుత్వాలను తారుమారు చేసే శక్తి తమకు ఉందని ఉద్యోగులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఉద్యమ కార్యచరణలో భాగంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు మొత్తం 71 డిమాండ్లను ఉంచాయి. ఇందులో ప్రధానమైనవి.. పిఆర్సీ 40 నుంచి 60 శాతం పెంచడం, సిపిఎస్ ( కంట్రిబ్యూటర్ పెన్సన్స్ స్కీమ్) రద్దు చేయడం, పెండింగ్‌లో ఉన్న డిఏల వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే జిపిఎఫ్, జిఎల్ ఐ బకాయిలు రూ.1600 కోట్లను విడుదల చేయాలన్నారు. వీటితో పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ రెగ్యులైజేషన్ చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు హామీల అమలు చేయాలని ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఉద్యోగ సంఘాల కార్యాచరణ ఇలా ఉండనుంది..

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యోగ సంఘాలు తమ యాక్షన్‌ ప్లాన్‌ను ప్రకటించాయి. ఇందులో భాగంగా డిసెంబర్‌ 7 నుంచి 10 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నారు. అనంతరం 10వ తేదీని లంచ్‌ టైమ్‌లో నిరసనలు తెలపనున్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే 13, 16వ తాలుకా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఇక 21న అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు, 27న విశాఖ, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు 6న ఒంగోలులో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ప్లాన్‌ చేసుకున్నాయి.

Also Read: స్క్విడ్‌ గేమ్‌ చూసిన వ్యక్తిపై కిమ్‌ దారుణం !! వీడియో

ట్రైన్‌లో విద్యార్థుల స్టంట్స్‌ !! సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !! వీడియో

Inspiring Story: తండ్రి అకాల మరణంతో ఆటో డ్రైవర్‌గా మారిన ఉషారాణి !! అందరికీ ఆదర్శం.. వీడియో