Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఈ రోజు మంత్రి బోత్సా డీఎస్సీ నోటిఫికేషన్, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి తదితర అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా..
ఏపీ నిరుద్యోగులకు తీపికబురు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఈ రోజు మంత్రి బోత్సా డీఎస్సీ నోటిఫికేషన్, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి తదితర అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తామన్నారు. మంత్రి ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘సీఎం జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటానన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించాం. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటాం. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. ఇందుకోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నాం. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నాం.. సీఎం జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం పాఠశాలల్లో పరీక్షలు, ఒంటి పుట బడులు జరుగుతున్నాయి. అందువల్లనే చిక్కిలు ఇస్తున్నామన్నారు.
తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. ‘విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీసుకురావడం జగన్ సర్కార్ పాలసి. మేము ఎవ్వరినీ డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అమరావతిలో రాజధానిని కాపురం కోసం పెట్టాడా..? అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటో? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు.. నేను ముందే చెప్పాను. ఈరోజు బిడ్డింగ్‌తో ఆ విషయం స్పష్టమయింది. మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు మా ప్రభుత్వం వ్యతిరేకం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు మంచి నటుడు, మ్యానిపులేటర్. తన తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు’ అని మంత్రి బొత్సా అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.