Ap Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 81 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కొత్తగా రాష్ట్రంలో 27,861 శాంపిల్స్ టెస్ట్ చేయగా 81 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,86,066కి చేరింది.
Ap Corona Cases: ఏపీలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కొత్తగా రాష్ట్రంలో 27,861 శాంపిల్స్ టెస్ట్ చేయగా 81 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,86,066కి చేరింది. మహమ్మారి వైరస్ కారణంగా విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఒకరు మృతిచెందినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ సోమవారం రిలీజ్ చేసిన బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 7,141కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 263 మంది కరోనా నుంచి కోలుకోగా..మొత్తం రికవరీల సంఖ్య 877212కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,713 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,04,214 టెస్టులు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు రాష్ట్రంలో కోవిడ్–19 వ్యాక్సిన్ ప్రక్రియ రెండో రోజు కూడా యాక్టివ్‌గా జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు 13,036 మందికి వ్యాక్సిన్ వేశారు. ఆదివారం రోజున అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,959 మందికి, కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 480 మందికి వ్యాక్సిన్ వేశారు.
Also Read : ఏపీలో వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల ప్రారంభానికి సర్కార్ ఏర్పాట్లు.. ‘నాడు-నేడు’లో భాగంగా భారీ మార్పులు