AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ఇవాళ నరసాపురంలో సీఎం జగన్‌ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌కు శంకుస్థాపన..

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు.

YS Jagan: ఇవాళ నరసాపురంలో సీఎం జగన్‌ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీ, ఫిషింగ్‌ హార్బర్‌కు శంకుస్థాపన..
AP CM YS Jagan
Shaik Madar Saheb
|

Updated on: Nov 21, 2022 | 6:39 AM

Share

YS Jagan Narsapuram Tour: ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ మత్స్యకార దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. ఏపీ ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ కు సీఎం శంకుస్థాపన చేస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలురి.10.50 నిమిషాలకు నరసాపురం చేరుకుంటారు. 11:15ని.ల నుంచి గం. 12.50ని.లవరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత మత్స్యకార బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. నరసాపురం నియోజకవర్గ పర్యటనలో సుమారు 3వేల 197 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శ్రీకారం చుడతారని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.

తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో మూడో ఆక్వా విశ్వవిద్యాలయం నరసాపురంలో ఏపీ ప్రభుత్వం స్థాపిస్తుంది. దీని కోసం 350 ఎకరాల్లో 332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ కు ఆమోదం లభించింది. అలాగే 490 కోట్లతో ఉభయ గోదావరి జిల్లాల చిరకాల వాంఛ అయిన వశిష్ట గోదావరి బ్రిడ్జి నిర్మాణం, 429 కోట్లతో ఫిషింగ్ హార్బర్, 1400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, 133 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్, 87 కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు, నరసాపురం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతుంది.

అలాగే నియోజకవర్గంలోని మోళ్లపర్రులో 180 కోట్లతో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం, 13కోట్లతో నరసాపురం పట్టణంలో వంద పడకల ఆసుప్రతి నిర్మాణం చేపడుతుంది. 4.80 కోట్లతో ఆధునీకరించిన ఆర్టీసీ క్లాంపెక్స్ ను జగన్ ప్రారంభిస్తారు. దర్భరేవు కాళీపట్నంలో జమీందారీ భూములు పంపిణీ చేస్తారు. 35 కోట్లతో కోతకు గురైన గోదావరి ఏటీకొట్టు అభివృద్ధి పనుల నిర్మాణం, 31 కోట్లతో వీఆర్ ఛానల్ అండ్ శేషవతారం ఛానల్ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..