Andhra Pradesh: వనభోజనాలకు వెళ్లిన వారిపై తేనె టీగల దాడి.. 25 మంది మహిళలకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
సుమారు 25మందిపై తేనెటీగల అటాక్ జరిగింది. వారిలో పది మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో వెంటనే రావులపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కార్తీక వనభోజనాల కోసం వెళ్తే తేనెటీగలు దాడి చేసిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో.. ఆలపాటివారి కుటుంబ సభ్యులు వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు. తోటలోకి పెద్ద సంఖ్యలో మహిళలు, కుటుంబసభ్యులు వెళ్లారు. ఓవైపు భోజనాలు సిద్ధమవుతుంటే.. మరోవైపు కొంత మంది మహిళలు పూజలు నిర్వహించారు. అందరూ ఆటపాటలతో సరదాగా గడిపారు. కాసేపట్లో కార్యక్రమం ముగించుకుని ఇంటికి వెళ్తామనగా.. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. సుమారు 25మందిపై తేనెటీగల అటాక్ జరిగింది. వారిలో పది మంది అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో వెంటనే రావులపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో మహిళలు కూడా ఉన్నారు. తేనెతుట్టెను కదపకుండానే, వాటి జోలికి వెళ్లకుండానే తేనెటీగలు వచ్చి దాడి చేయడం.. స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.
ఖమ్మం జిల్లాలోనూ..
కాగా శనివారం ఖమ్మం జిల్లాలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులపై శనివారం తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 38 మంది విద్యార్థులతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులు గాయపడ్డారు. మధ్యాహ్నం సమయంలో పిల్లలు పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా తేనె టీగలు చుట్టుముట్టాయి. బాధితులను చికిత్స కోసం కొత్తగూడెం తరలించారు. గాయపడిన మిగిలిన విద్యార్థులకు సులానగర్ పీహెచ్‌సీ సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..
