AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Services: ఇకపై గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు.. ప్రారంభించేది ఎప్పుడంటే?

Aadhaar Services In Village Secretariats: కొత్త ఆధార్ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ఆధార్‌లో మార్పులు చేర్పులు వంటివి చేయాలా? ఇకపై...

Aadhaar Services: ఇకపై గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు.. ప్రారంభించేది ఎప్పుడంటే?
Grama Sachivalayam
Ravi Kiran
|

Updated on: Jun 23, 2021 | 7:17 AM

Share

కొత్త ఆధార్ కార్డు కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ఆధార్‌లో మార్పులు చేర్పులు వంటివి చేయాలా? ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.! ఇలాంటి సమస్యలు సులభంగా పరిష్కారమయ్యేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ సచివాలయాల్లో కూడా ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవల్ని జూలై రెండోవారంలో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ భరత్ గుప్తా వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద మొదటిగా 500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులో తీసుకొస్తామని.. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు వీటిని విస్తరిస్తామని తెలిపారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 226 మండలాల్లో ఆధార్ సేవలు అందుబాటులో లేవని.. మొదటి ప్రాధాన్యతగా ఈ సేవలను ఆయా మండలాల్లో ప్రారంభిస్తామన్నారు. వీటితో పాటు అదనంగా జిల్లాకు 20 చొప్పున గ్రామ సచివాలయాల్లోనూ ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని భరత్ గుప్తా చెప్పుకొచ్చారు. ఆధార్ సేవలను ఏయే గ్రామ సచివాలయాల్లో ప్రారంభించాలన్న నిర్ణయాన్ని జాయింట్ కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు. కాగా, ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా ప్రస్తుతం పోస్టాఫీసులు, కొన్ని బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:

13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!

పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!